వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది భార్య. ఆదివారం ( డిసెంబర్ 14 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల కేంద్రంలో అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి భర్తను ట్రాక్టర్ తో గుద్ది చంపించి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది భార్య. చౌడాపూర్ కు చెందిన కర్రె కవిత అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణ మధ్య కొన్నేళ్లుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. ఈ వ్యవహారం తెలియడంతో కవితను మందలించాడు భర్త రత్నయ్య.
అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని రత్నయ్యను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి పథకం పన్నింది కవిత.ఉదయం పొలం నుండి వస్తుండగా రత్నయ్యను ట్రాక్టర్ తో డీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు నిందితులు. ట్రాక్టర్ తో గుద్దటంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు రత్నయ్య.మొదట ప్రమాదంగా భావించిన పోలీసులు మృతుడి సోదరుని ఫిర్యాదుతో అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసుల విచారణలో వెలుగులోకి కీలక విషయాలు:
భార్య కవిత, ప్రియుడు రామకృష్ణ అక్రమసంబంధం బయట పడడంతో తమదైన శైలిలో విచారణ చేశారు పోలీసులు. అక్రమసంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో కలిసి హత్య చేశారని వెల్లడించారు పరిగి డీఎస్పీ శ్రీనివాస్. నేరం అంగీకరించిన ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు పోలీసులు.
