ప్రియురాలితో ఉన్న భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

ప్రియురాలితో ఉన్న భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య

తనను కాదని ప్రియురాలితో కాపురం పెట్టిన భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది భార్య. చిత్తూరులో లాయర్ గా పనిచేస్తున్న చంద్రమౌళి తిరుపతి పద్మావతినగర్ లో ఇల్లు అద్దెకు తీసుకొని వేరే మహిళతో ఉంటున్నారని భార్య కవిత ఆరోపిస్తోంది. ప్రియురాలి ఇంటికి వచ్చిన తనను చూసి.. ఇంటి వెనుక నుంచి దూకి చంద్రమౌళి పారిపోయారన్నారు. బంధువులు, మీడియాతో ఇంటి లోపలికి వెళ్లి.. తన ఇంట్లో  నుంచి ఏమేం తెచ్చారో చూపించారు కవిత. తనకు న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించడంతో.. పోలీసులు ఆమెకు నచ్చ జెప్పారు. కవిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

దేశంలో లక్షా25 వేలు దాటిన కరోనా మరణాలు