లవర్ సాయంతో భర్తను చంపిన భార్య

లవర్ సాయంతో భర్తను చంపిన భార్య

తమ అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంతో.. ప్రేమికునితో కలిసి ఓ భార్య భర్తను చంపేసింది. ఈ ఘటన ఢిల్లీలోని జల్వర్ వాలా బాగ్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శరత్ అనే వ్యక్తి తన భార్య అనితతో కలిసి జల్వర్ వాలా బాగ్‌లో నివసిస్తున్నాడు. అనిత అదే కాలనీకి చెందిన సంజయ్ అనే యువకుడితో అక్రమసంబంధం కొనసాగిస్తోంది. ఆ విషయం శరత్ కు తెలిసి అనితతో గొడవపడ్డాడు. దాంతో ఎలాగైన శరత్ ను అడ్డు తొలగించుకోవాలని అనిత, సంజయ్ అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ ఆలోచనను అమలుచేశారు వారిద్దరు. మే 2న రాత్రి శరత్ నిద్రిస్తుండగా.. అనిత, సంజయ్ కు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ఇద్దరూ కలిసి దుప్పటితో శరత్ కు ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత శరత్ అనుమానస్పదంగా చనిపోయినట్లు అనిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు .. తమదైన శైలిలో అనితను విచారించగా.. సంజయ్ ను తామే చంపినట్లు ఒప్పుకుంది. పోలీసులు శరత్ మృతదేహాన్ని బీజేఆర్ఎం ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం చేసిన వైద్యులు.. శరత్ ఊపిరి ఆడకపోవడం వల్లే చనిపోయినట్లు నిర్దారించారు. అనిత, సంజయ్ లపై పోలీసులు 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

For More News..

కాన్వెంట్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన 21 ఏళ్ల యువతి

ట్రాక్టర్ ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

మహారాష్ట్రలో రైలు ప్రమాదం .. 14 మంది మృతి