- మెడకు చున్నీ చుట్టి ఉపిరాడకుండా చేసి మర్డర్..
- హైదరాబాద్ హఫీజ్పేట్ పరిధిలో ఘటన
మియాపూర్, వెలుగు : కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించాల్సిన భర్త మద్యానికి బానిసై రోజూ తనను , పిల్లలను కొడుతుండడంతో ఆ భార్య విసుగు చెందింది. అతడి వేధింపులు భరించలేక మెడకు చున్నీ బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. అస్సాంకు చెందిన అలీ హుస్సేన్లష్కర్(35) తన భార్య రుస్తానా బేగం లష్కర్, ఇద్దరు బిడ్డలు, కొడుకుతో కలిసి రెండేండ్ల కింద హైదరాబాద్వచ్చాడు. హఫీజ్పేట్ ప్రేమ్నగర్బి బ్లాక్లో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
కొంతకాలంగా మద్యానికి బానిసైన అలీ హుస్సేన్రోజూ రాత్రి తాగివచ్చి భార్య, పిల్లలను కొట్టేవాడు. ఈ నెల19న అర్ధరాత్రి తాగి వచ్చిన అలీ హుస్సేన్ భార్యతో గొడవ పడి కొట్టాడు. 20న తెల్లవారుజామున కూడా భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ప్రతి రోజు ఈ సతాయింపులు భరించలేని రుస్తానా భర్త మెడకు చున్నీ బిగించి ఉపిరాడకుండా చేసి హత్య చేసింది. తానే హత్య చేశానని రుస్తానాబేగం ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు మియాపూర్ సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ తెలిపారు. అయితే, తండ్రి హత్యకు గురవ్వడం, తల్లిని జైలుకు వెళ్లడంతో పిల్లలు అనాథలయ్యారు.