
జర్నలిస్టు రఘును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆయన భార్య లక్ష్మీప్రవీణ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌ను విచారణకు స్వీకరించి ప్రతివాదులకు హైకోర్టు నోటీసులిచ్చింది. అరెస్ట్ అక్రమమో.. కాదో తేలుస్తామని హైకోర్టు తెలిపింది. బెయిల్ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం గుర్రంపోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘు పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న(గురువారం)హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలోని తన ఇంటి నుంచి బైక్ పై బయటకు వెళ్లిన రఘును..పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.