
తనపై వరుసగా జరిగిన దాడుల నేపథ్యంలో బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. తన హత్యకు బీజేపీ కుట్రపన్నుతుందని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీలాగా ఏదో ఒక రోజు తనను హత్య చేస్తారని.. తన పర్స్ నల్ సెక్యూరిటీ ఆఫీసర్ (పీఎస్ఓ) తో బీజేపీ ఆ పని చేయిస్తుందని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ పై ఇప్పటికే తొమ్మిది సార్లు దాడులు జరిగాయి. దీంతో బీజేపీపై కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.