ఐపీఎల్ ఆటగాళ్లు ఫ్యామిలీని తీసుకెళ్లొచ్చా..?

ఐపీఎల్ ఆటగాళ్లు ఫ్యామిలీని తీసుకెళ్లొచ్చా..?

ఎటూ తేల్చుకోలేకపోతున్న ఫ్రాంచైజీలు

న్యూఢిల్లీ: ఐపీఎల్ లో ఆడే క్రికెటర్లు.. తమ ఫ్యామిలీ మెంబర్స్ ను వెంట తీసుకెళ్లేందుకు అనుమతించాలా ? వద్దా? అనే విషయంపై ఫ్రాంచైజీలు ఏటూ తేల్చుకోలేక పోతున్నాయి. ఈ విషయంలో బీసీసీఐ తమకే నిర్ణయాధికారాన్ని ఇచ్చినా.. ఫ్రాంచైజీలు మా త్రం అడుగు ముందుకు వేయలేకపోతున్నాయి. ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ ను తీసుకెళ్తే .. వాళ్లు బయో బబుల్ ప్రోటోకాల్స్ ను ఉల్లంఘిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై కూడా క్లారిటీ లేదు.

దీంతో ఈ అంశంలో లిఖిత పూర్వక స్పష్టత  కావాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాయి. అలాగే వీలైనంత త్వరగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ వోపీ) అందజేయాలని కోరాయి. మరో రెండు రోజుల్లో జరిగే ఫ్రాంచైజీల మీటింగ్ లో దీనిపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఆగస్ట్ 20 తర్వాత ఫ్రాంచైజీల ట్రావెలింగ్ మొదలుకావొచ్చు.