మోడీ సభకు వర్షం అడ్డంకిగా మారుతుందా

మోడీ  సభకు వర్షం  అడ్డంకిగా మారుతుందా

ప్రధాని నరేంద్రమోడీ (Prime Minister Modi) హైదరాబాద్ (Hyderabad)లో ఏప్రిల్ 8వ తేదీన పర్యటిస్తారు. రెండు గంటల పాటు మోడీ సికింద్రాబాద్లో ఉండనున్నారు. ఉదయం 11:30 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్టు(Begumpet Airport)కు చేరుకోనున్న ప్రధాని.. తన పర్యటనలో భాగంగా 11:45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station)లో సికింద్రాబాద్–తిరుపతి వందే భారత్ ట్రైన్(Secunderabad-Tirupati Vande Bharat Rail) ను ప్రారంభిస్తారు. అనంతరం 12:15 గంటలకు పరేడ్ గ్రౌండ్ కు చేరుకుంటారు. ఇక్కడ పబ్లిక్ మీటింగ్ లో ఆరు జాతీయ రహదారులకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు పథకాలను జాతికి అంకితం చేస్తారు. అనంతరం 12:50 గంటల నుంచి 1:20 గంటల వరకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. అయితే హైదరాబాద్ లో రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మోడీ సభకు వాన అడ్డంకిగా మారే అవకాశం ఉంది

వాతావరణం ఎలా ఉంటుంది..

హైదరాబాద్తో పాటు..రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో రానున్న మూడు రోజులపాటు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదిలాబాద్, కొమురంభీ అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ  ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు పడే అవకాశం ఉందని పేర్కొంది. .

హైదరాబాద్లో వర్షాలు పడతాయా..!

ఏప్రిల్ 8వ తేదీన హైదరాబాద్ లో వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ తో పాటు.. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరిలో వడగళ్లతో కూడిన వర్షాలు పడే ఛాన్సుందని పేర్కొంది. 8వతేదీనే కాదు..ఏప్రిల్ 9న కూడా  హైదరాబాద్,  మేడ్చల్ తో పాటు..రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో  ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే ఏప్రిల్ 10 నుంచి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.