క్వాలిఫయర్ 1కు వర్షం ముప్పు.. RCB vs GT జరిగేది డౌటే!

క్వాలిఫయర్ 1కు వర్షం ముప్పు.. RCB vs GT జరిగేది డౌటే!

 IPL 2026 Qualifier 1ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత కీలకమైన ఘట్టానికి చేరుకుంది. లీగ్ దశలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ దూసుకొచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో తలపడేందుకు సర్వం సిద్ధమైంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌ ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియం వేదిక కానుంది. రెండు జట్లలోనూ టాప్ ఆర్డర్ బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కుతుండగా, బౌలర్లు కూడా సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. కానీ, సముద్ర మట్టానికి 1,400 మీటర్ల ఎత్తులో ఉండే ఈ స్టేడియంలో మ్యాచ్ అనగానే అందరి కళ్ళు వాతావరణంపైనే ఉంటాయి. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఇరు జట్ల సమీకరణాలు ఎలా ఉంటాయి, పిచ్ ఎవరికి సహకరిస్తుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

ధర్మశాలలో ప్రస్తుత వాతావరణం: 
ప్రస్తుతానికైతే ధర్మశాలలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా, కూల్‌గా ఉంది. అక్కడ ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌ మధ్య నమోదవుతుండటంతో, చల్లటి గాలుల మధ్య క్రికెట్ ఆడేందుకు వాతావరణం అద్భుతంగా అనుకూలిస్తోంది. అయితే మంచు కొండల ప్రాంతం కావడం వల్ల రోజు గడిచేకొద్దీ వాతావరణంలో మార్పులు వచ్చే ఛాన్స్ లేకపోలేదని, సాయంత్రానికి మబ్బులు పట్టే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

క్రికెట్ ఫ్యాన్స్‌కు బిగ్ రిలీఫ్: 
టాస్ పడే సమయానికి వాతావరణం ఎలా ఉంటుందనే ఆందోళనలో ఉన్న అభిమానులకు 'AccuWeather' రిపోర్ట్ కాస్త ఉపశమనం కలిగించింది. సాయంత్రం 6:00 గంటల ప్రాంతంలో వర్షం పడే అవకాశం 54 శాతంగా ఉన్నప్పటికీ, మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వర్షం పడదని తెలిపింది. దీన్ని బట్టి చూస్తే మ్యాచ్ జరిగే సమయానికి ఆకాశం పూర్తిగా క్లియర్ గా ఉంటుంది కాబట్టి, ఆటకి ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read : GTపై గెలిస్తే రెండోసారి IPL కప్ కొట్టేది RCBనే..? 

మ్యాచ్ రద్దయితే ఫైనల్‌కు వెళ్లేది ఎవరు?: 
ఈ ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌కు బీసీసీఐ (BCCI) ఎలాంటి రిజర్వ్ డే (Reserve Day) కేటాయించలేదు. ఒకవేళ అంచనాలు తలకిందులై ధర్మశాలలో భారీ వర్షం కురిసి, కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ లేదా సూపర్ ఓవర్ కూడా సాధ్యం కాకుండా ఆట పూర్తిగా రద్దయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది. ఐపీఎల్ రూల్స్ ప్రకారం నాకౌట్ మ్యాచ్ వర్షంతో క్యాన్సిల్ అయితే, లీగ్ స్టేజ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో (Table Topper) ఉన్న జట్టుకే ఫైనల్ బెర్త్ లభిస్తుంది. ఈ సీజన్ లీగ్ దశలో ఆర్‌సీబీ నంబర్ 1 పొజిషన్ లో ఉండటంతో వారికి ఈ లక్ కలిసిరానుంది. ఇక ఒకవేళ మ్యాచ్ రద్దయితే గుజరాత్ టైటాన్స్ జట్టు క్వాలిఫైయర్ 2 ఆడాల్సిన పరిస్థితి నెలకొంది.  

పిచ్ రిపోర్ట్: 
ధర్మశాల పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు స్వర్గధామంగా నిలుస్తుంది. ఇక్కడి వికెట్‌పై బంతి బ్యాట్‌పైకి చాలా చక్కగా వస్తుంది కాబట్టి బ్యాటర్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా షాట్లు ఆడి భారీ స్కోర్లు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. పిచ్ కండిషన్స్ దృష్ట్యా మొదట బ్యాటింగ్ చేసే జట్టు కనీసం 200 నుంచి 220 పరుగుల భారీ స్కోరే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్‌కు అనుకూలించినప్పటికీ, లైన్ అండ్ లెంగ్త్ పాటిస్తూ పిచ్‌ను గట్టిగా హిట్ చేసే పేసర్లకు ఇక్కడ మంచి బౌన్స్, స్వింగ్ లభిస్తుంది. ధర్మశాలలోని వాతావరణం ఆటగాళ్లకు మరింత జోష్ ఇవ్వడం ఖాయం, మరి ఈ భీకర పోరులో గెలిచి ఏ జట్టు మొదటిగా ఫైనల్ చేరనుందో చూడాలి మరీ!