జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం: మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్​రెడ్డి

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం:  మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్​రెడ్డి

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సానుకూలంగా ఉందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్​కె.శ్రీనివాస్​రెడ్డి చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి తనవంతు కృషి చేస్తానన్నారు. గురువారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ జర్నలిస్టుల బృందం ఆధ్వర్యంలో కె.శ్రీనివాస్ రెడ్డిని, వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీని సత్కరించారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేశపాక స్వామి అధ్యక్షత వహించారు. 

ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..  జర్నలిస్టుల సమస్యలపై తనకు సంపూర్ణ అవగాహన ఉందని, లోక్ సభ ఎన్నికల తర్వాత జర్నలిస్టులకు​ఇళ్ల స్థలాలు లేదా ఇండ్లు పంపిణీ ప్రాసెస్​వేగవంతం చేస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు తెలిపారు. హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు శిగ శంకర్ గౌడ్, జర్నలిస్టులు పాల్గొన్నారు.