సెక్రటేరియట్‌ లోని చెట్లను నరికేస్తరా.. వేరే దగ్గర నాటుతరా?

సెక్రటేరియట్‌ లోని చెట్లను నరికేస్తరా.. వేరే దగ్గర నాటుతరా?

ఏం చేస్తారో స్పష్టత కరువు..

వంద ఏండ్లనాటి చెట్లు 30 పైనే

సెక్రటేరియట్లో మొత్తంగా 700 వరకు చెట్లు

తమకేం తెలియదంటున్న అటవీ, ఉద్యాన శాఖలు, జీహెచ్ఎంసీ

రాత్రిపూట కొట్టేస్తారని ఊహాగానాలు

హైదరాబాద్, వెలుగు: సెక్రటేరియట్‌ లో బిల్డింగుల కూల్చివేత పూర్తవడంతో మరి అందులోని చెట్లను ఏం చేస్తారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వందల ఏండ్ల నా టి భారీ వృక్షాలను కొట్టేస్తరా లేక వేరే చోట రీ ప్లాంటేషన్ చేస్తరా క్లారిటీ లేదు. చెట్ల తొలగింపు, రీ ప్లాంటేషన్‌‌పై అటవీ, ఉద్యాన, జీహెచ్‌‌ఎంసీ అధికారులను సంప్రదించగా తమకేం తెలియదని చెబుతున్నారు. మొదటి నుంచి సె క్రటేరియట్ కూల్చివేతలను నిర్వహిస్తున్న ఆర్ & బీ అధికారులూ స్పందించడం లేదు. కొందరేమో గుట్టు చప్పుడు కాకుండా రాత్రివేళ చెట్లను కొట్టేస్తారని అంటున్నారు. 23 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సెక్రటేరియట్‌లో అశోక, మర్రి, వేప లాంటి చెట్లు 700 వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వంద ఏండ్లకు పైబడిన చెట్లు సుమారు 30 వరకు ఉన్నట్లు సమాచారం.

పర్యావరణవేత్తల ఆందోళన

పాత సెక్రటేరియట్‌ను కూల్చి కొత్తది కడతారని చెప్పినప్పటి నుంచీ చెట్లను ఏం చేస్తారని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. రోజు రోజుకు కాలుష్యం పెరుగుతుంటే చెట్లను కాపాడుకోకుండా ఇలాంటి నిర్ణయాలు ఏంటని ప్రశ్నిస్తున్నారు. హరితహారం చేస్తూ కోట్ల మొక్కలు నాటాలంటున్న సర్కారు.. సెక్రటేరియట్ చెట్లను కొట్టేసే నిర్ణయం తీసుకోవద్దంటున్నారు. పట్టణాలు, నగరాలు, మెట్రో సిటీల్లో చెట్లు తక్కువుతుండటం వల్ల చాలా మంది కొన్నేళ్ల నుంచి సిటీకి దూరంగా నివసిస్తున్నారని పర్యావరణ వేత్తలు గుర్తు చేస్తున్నారు. సెక్రటేరియట్ చెట్లను ఏం చేస్తారో స్పష్టతనివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.