ఇరాన్ లో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. అటూ ట్రంప్.. ఇటు ఖమేనీ హెచ్చరికలు..ఇరాన్ సమీపంలో అమెరికా తన సైనిక ఉనికిని పెంచడం వంటి అనేక పరిణామాలు ఇరాన్ పై అమెరికా ప్రత్యక్ష దాడికి పాల్పడుతుందనే సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ వైపు మా పెద్ద సైన్యం కదులుతోందంటూ ట్రంప్ బహిరంగ ప్రకటన చేశారు. అందుకు అనుగుణంగా అమెరికా విమాన వాహన నౌక అబ్రహాం లింకన్, F12E జెట్ లను ఇరాన్ సరిహద్దులకు తరలించారు. అమెరికన్ స్థావరాలపై దాడులు జరిగితే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు ట్రంప్. అదే సమయంలో ఇరాన్ నాయకత్వంపై గానీ ఏదైనా దాడి జరిగితే యుద్దం తప్పదని ఖమేనీ హెచ్చరించారు.
ఇరాన్ నిరసనల్లో వేలాది మంది మృతి చెందిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోఅమెరికా యుద్ద విమాన వాహన నౌక, ఫైటర్ జెట్ల వంటి సైనిక శక్తిని ఇరాన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది అమెరికా. ఇజ్రాయెల్ అనూహ్యంగా యుద్దానికి సిద్దమవుతున్న సమయంలో ఇరాన్ తనపై సైనిక స్థావరాలపై దాడి చేస్తే మొత్తం సైన్యాన్ని రంగంలోకి దించేందుకు అమెరికా రెడీ అవుతోంది.
అమెరికా మీడియా సంస్థలు, రిపోర్టుల ప్రకారం.. మిడిల్ ఈస్ట్ లో సైనిక కార్యకలాపాలు నిర్వహించే యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) ను బలోపేతం చేస్తోంది. F-15E స్ట్రైక్ ఈగిల్ జెట్లు, విమాన వాహన నౌక USS అబ్రహాం లింకన్ ను వ్యూహాత్మకంగా ఇరాన్ కు దగ్గరగా తీసుకువస్తోంది. మిడిల్ ఈస్ట్ లో తన వాయు సేన, క్షిపణీ రక్షణ వ్యవస్థను కూడా బలోపేతం చేస్తుంది. ఇరాన్ వైపు ఒక పెద్ద దళం కదులుతోందని గురువారం ట్రంప్ ప్రకటించిన తర్వాత వెనువెంటనే ఇది జరిగింది.
అంతకుముందు బుధవారం దావోస్ లో ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) లో మాట్లాడిన ట్రంప్.. ఇరాన్ పై సైనిక చర్య అవసరం ఉండదని భావిస్తున్నాని చెప్పారు. తన బెదిరింపుతో ఇరాన్ వెనక్కి తగ్గిందన్నారు. టెహ్రాన్ లో 835 మంది నిరసనకారుల ఉరిశిక్షలను నిలిపివేసిందన్నారు. ఇరాన్ ప్రభుత్వం ఉరిశిక్షలను నిలిపివేస్తుందని హామీ ఇచ్చిన తర్వాత అమెరికా సైనిక చర్యను విరమించుకుందని అమెరికా మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.
ఇరాన్ లో అల్లర్లలో విదేశీ శక్తుల హస్తం ఉందని.. దీనంతటికీ అమెరికా, ఇజ్రాయెలే కారణమంటూ ఇరాన్ పై దాడి జరిగితే ట్రంప్ పై దాడి తప్పదని ఇరాన్ సుప్రీం అయతుల్లా ఖమేనీ బెదిరించిన తర్వాత పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. టెహ్రాన్ నుంచి వస్తున్న బెదిరింపులకు ఇరాన్ పై దాడి తప్పదని అధిక శక్తితో ఎదుర్కొంటామని ట్రంప్ హెచ్చరించారు. ఈ క్రమంలో ఇప్పటికే అమెరికా మిడిల్ ఈస్ట్ అంతటా వేగంగా సైనిక బలగాలను మోహరిస్తున్నారు. నిర్ణయాత్మక దాడికి సిద్దంగా ఉండాలని సైన్యాన్ని ఆదేశించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది.
మిడిల్ ఈస్ట్ లో అమెరికా బలగాల మోహరింపు
రిపోర్టుల ప్రకారం.. 2026 జనవరి ప్రారంభం నుంచే ఇరాన్ చుట్టూ బలగాలను మోహరిస్తోంది. మిడిల్ ఈస్ట్ కార్యకలాపాలను నిర్వహించే సెంట్ కామ్(CENTCOM) ను బలోపేతం చేస్తోంది. ఎయిర్ అండ్ స్పేస్ ఫోర్సెస్ మ్యాగజైన్, US వైమానిక దళానికి చెందిన 12 స్ట్రైక్ ఈగిల్ జెట్లను UK నుంచి జోర్డాన్‌లోని వైమానిక స్థావరాలకు తరలించింది. వైమానిక రీఫ్యూయలర్లు ,కార్గో విమానాలను తిరిగి మోహరించింది. ఇటీవల జరిగిన దాడుల్లో ఇరానియన్ డ్రోన్లను ఎదుర్కొనేందుకు F-15 E జెట్లను ఇజ్రాయెల్, అమెరికా రెండూ వినియోగించాయి. తాజాగా ఫైటర్ జెట్లతో కూడిన USS అబ్రహం లింకన్ విమాన వాహక నౌక ఇరాన్ దగ్గరలో మోహరించింది. ఈ సైనిక మోహరింపులతో ఇరాన్‌పై వేగంగా విస్తృత దాడులు చేసేందుకు వాషింగ్టన్ రెడీ అవుతోందని తెలుస్తోంది.
ది వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం..గురువారం నాటికి ఇరాన్ పై దాడికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఎటువంటి ఆదేశాలు లేవు. ఇరాన్ పై దాడి చేయాలంటే పెద్ద సంఖ్యలో F35 స్టెల్త్ జెట్లు, B2 బాంబర్లు అవసరం.. వీటిని ఇంకా ఆ ప్రాంతంలో మోహరించలేదు. అయితే ఇజ్రాయెల్ తరుచు వార్నింగ్స్, తరచు మారుతున్న ట్రంప్ వ్యాఖ్యలను చూస్తే మిడిల్ ఈస్ట్ లో పెరుగుతున్న అమెరికా సైనిక శక్తి .. ఇరాన్ పై అమెరికా సైనిక చర్య, ఆకస్మిక దాడులకు పాల్పడే అవకాశాలను తోసిపుచ్చలేమని సూచించింది.
