గెలిపించిన ప్రజల కోసం నమ్మకంగా పనిచేస్తా

గెలిపించిన ప్రజల కోసం నమ్మకంగా పనిచేస్తా

కేవలం మూడేళ్లు మాత్రమే అధికారంలో ఉంటదని తెలిసి కూడా దుబ్బాక ప్రజలు తనకు పట్టం కట్టారని…తనను నమ్మి గెలిపించిన ప్రజలకు నమ్మకంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఇవాళ దుబ్బాకలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు రఘునందన్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఎంత విశ్వాసంతో  ప్రజలు తనను నమ్మి గెలిపించారని…అంతే నమ్మకంతో ప్రజలకు సేవ చేస్తానని తెలిపారు. దుబ్బాక అభివృద్ధి.. సిద్దిపేట సిరిసిల్ల, గజ్వేల్ తరహా లో తీర్చి దిద్దుతానన్నారు. మంది కొంపలు కూల్చడానికి రాజకీయాలకు రాలేదని.. అవినీతిని కట్టడి చేయడానికి వచ్చానని స్పష్టం చేశారు. డిసెంబర్ 2వ తారీఖు నుండి ఎవరికి ఏ అవసరమున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందుబాటులో ఉంటానని…వచ్చి కలవచ్చని తెలిపారు. కమీషన్ల కోసం కాంట్రాక్టుల కోసం కాదు ..నాకు అవకాశం ఇచ్చిన ప్రజల కోసం తప్పకుండా మార్పు తీసుకొస్తానని తేల్చి చెప్పారు. ఇక నుండి మూడేళ్ల ఎవరు ఎవ్వరికీ ఒక్క రూపాయి లంచం ఇవ్వద్దని తెలిపారు. కేసీఆర్ పునాదులు దుబ్బాక నుండే పెకిలించుడు మొదలైందన్న రఘునందన్ రావు.. డిసెంబరు 2నుండి ప్రతి గల్లీకి వచ్చి మీ సమస్యలు తెలుసుకుంటామన్నారు.