న్యూఢిల్లీ: బంగ్లా భాష మాట్లాడితే బంగ్లాదేశ్‌కు డిపోర్ట్ చేయడం అమానుషమని టీఎంసీ ఎంపీ శతాబ్ది రాయ్ మండిపడ్డారు. డిపోర్టేషన్‌కు భాషను ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదన్నారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆమె బంగ్లా భాషలో మాట్లాడారు.
ఒడిశా నుంచి ఒక వ్యక్తిని బంగ్లాదేశ్‌కు పంపిన విషయాన్ని ప్రస్తావించారు. “బంగ్లా మాట్లాడుతున్నారని బంగ్లాదేశ్‌కు పంపితే, హిందీ, ఉర్దూ మాట్లాడుతున్న బీజేపీ సభ్యులను పాక్‌కు పంపిస్తారా?” అని అడిగారు. ఆమె కామెంట్స్‌పై బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
