లక్ష్మీ దేవి ఎప్పుడు ఎవర్ని వరిస్తుందో తెలియదు. కొందరు ఉన్నంటుంది దివాలా తీస్తే, ఇంకొందరు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవుతుంటారు. అలానే బీహార్ కి చెందిన రాజురామ్ కి కూడా ఒక్క రాత్రిలో కోటీశ్వరుడయ్యాడు.
విషయానికొస్తే స్థానికంగా డీజేగా పనిచేస్తున్న రాజురామ్ ఏడాది కాలంగా డ్రీమ్ 11 ఆన్ లైన్ బెట్టి్ంగ్ సైట్ లో క్రికెట్ బెట్టింగ్ పెడుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న బీపీఎల్ టోర్నీలో బ్రిస్బేన్ హిట్, సిడ్నీ థండర్ మధ్య జరిగిన మ్యాచ్ లో ప్లేయర్స్ పై రూ.49తో బెట్టింగ్ పెట్టాడు. అందులో రాజురామ్ ఎంచుకున్న టీం అగ్రస్థానంలో నిలవడంతో రూ. కోటి గెలుచుకున్నాడు. ఆ వార్త విని రాజురామ్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. కాకపోతే రాజురామ్ గెలుచుకున్న కోటీలో పన్నుల రూపంలో రూ. 30 లక్షలు కట్ కాగా మిగిలిన రూ.70 లక్షలు అతని అకౌంట్ లో జమయ్యాయి.