తీన్మార్ మల్లన్నను గెలిపించండి : మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి

తీన్మార్ మల్లన్నను గెలిపించండి : మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : గ్రాడ్యుయేట్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్  మల్లన్నను గెలిపించాలని ఓటర్లను మాజీ ఎమ్మెల్సీ మోహన్  రెడ్డి కోరారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్  ప్రభుత్వం ఉద్యోగాల కల్పనపై చిత్తశుద్ధితో ఉందని, 30 వేల మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వడంతో పాటు టీఎస్ పీఎస్సీ ప్రక్షాళన చేసి నోటిఫికేషన్లు ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. టీచర్  పోస్టులు భర్తీ చేయడంతో పాటు సర్కారు స్కూళ్లు డెవలప్  చేస్తున్నారన్నారు.

పట్టభద్రులు ఎవరికి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందో ఆలోచించాలన్నారు. ప్రభుత్వానికి, గ్రాడ్యుయేట్లకు మధ్య తీన్మార్  మల్లన్న అనుసంధానకర్తగా ఉంటారని మోహన్ రెడ్డి చెప్పారు. ఎంపీ ఎన్నికల కోడ్  తరువాత టీచర్ల ప్రమోషన్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్  ఇస్తుందని

ఎవరూ ఆందోళన చెందోద్దని మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్  అన్నారు. పదేండ్లలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, వచ్చే ఐదేండ్లలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తారని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్లన్నను గెలిపించాలని ఆయన కోరారు.