బ్రెజిల్​లో తుఫాన్..13 మంది మృతి

బ్రెజిల్​లో తుఫాన్..13 మంది మృతి

నోవో హంబర్గో: దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్​లో గాలి తుఫాన్ ​బీభత్సం సృష్టించింది. దీంతో 13మంది మృతి చెందారు. వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. గురు, శుక్రవారాల్లో ఎడతెరిపిలేని వర్షాలకు రియో గ్రాండె డు సుల్​స్టేట్​లో పదుల సంఖ్యలో పట్టణాలు దెబ్బతిన్నాయి. రాజధాని పోర్టో అలెగ్రే కూడా తుఫాన్​ ధాటికి అతలాకుతలమైంది.

తీరప్రాంత పట్టణం కారాలో రెండు మృతదేహాలు గుర్తించామని దీంతో తుఫాన్​కారణంగా చనిపోయిన వారి సంఖ్య 13కి చేరినట్లు స్టేట్​ సివిల్ డిఫెన్స్​ఏజెన్సీ తెలిపింది. కారాలో వరదనీటిలో గల్లంతైన ముగ్గురి ఆచూకీ ఇంకా లభ్యంకాలేదని ఏజెన్సీ వెల్లడించింది. కాగా, అధికార లెక్కల ప్రకారం ట్రామందాయ్​ పట్టణంలో గంటకు 101.9 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఇండ్లు దెబ్బతినడంతో సుమారు 5 వేల మంది వారి ఇళ్లను విడిచి వెళ్లారు.