స్విట్జర్లాండ్‌లో వైన్‌ వేడుకలు

స్విట్జర్లాండ్‌లో వైన్‌ వేడుకలు

స్విట్జర్లాండ్‌లో వైన్‌ తయారీదారుల వేడుకలు గా పిలిచే వేడుకలు ఇరవై ఏళ్ల తర్వాత వేవే నగరంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అక్కడి ద్రాక్ష తోటల్లో జరిగే వేడుకలు ప్రపంచంలో అత్యంత అరుదుగా జరిగే అతి పెద్ద వైన్ ఉత్సవాలుగా ప్రసిద్ధి చెందాయి. వైన్‌ ఉత్పత్తిలో వాడే ద్రాక్షను పండించే కార్మికులు ఈ వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. బ్రదర్‌ హుడ్‌ ఆఫ్ వైన్‌ బ్రోవర్స్‌గ అనే కమిటీ ఈ సెలబ్రేషన్స్ ను నిర్వహిస్తోంది. 1797లో ప్రారంభం అయిన ఈ వేడుకలు 100 సంవత్సరాల కాలంలో అయిదు సార్లు మాత్రమే జరుగుతాయి. ఇప్పటి వరకు కేవలం 11 సార్లు మాత్రమే జరగగా… చివరగా 1999లో జరిగాయి. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 11 వరకు 12వ వేడుక జరుగుతోంది. దాదాపు పదిలక్షల మంది ఈ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. కళాకారుల నృత్యాలు.. సంగీత కవాతు.. ఈ వేడుకల్లో భాగం అయినప్పటికీ అంతిమంగా వైన్ తయారీకి వాడే ద్రాక్ష పండించే కార్మికులకు అవార్డులను ప్రదానం చేయడమే ఈ వేడుక ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.