
మద్యం ప్రియులకు చేదు వార్త. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాల్లో ఒక రోజు వైన్స్, బార్లు, కల్లు దుకాణాలు మూతపడనున్నాయి. మొన్న శ్రీరామ నవమి సందర్భంగా జంట నగరాలలో మద్యం షాపులు మూతపడిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 12న మరోసారి మూత పడనున్నాయి. ఆ రోజు హనుమాన్ జయింతి ఉండటమే అందుకు కారణం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ అధికారులు.
ఏప్రిల్ 12న హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాలలో మద్యం దుకాణాలు తెరుచుకోవని ప్రకటించారు. శనివారం హనుమాన్ జయంతి సందర్భంగా 24 గంటల పాటు బంద్ ఉండనున్నాయి. ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి 13 ఉదయం 6 గంటల వరకు మూత పడనున్నాయి.
తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్, 1968, సెక్షన్ 20 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశారు ఎక్సైజ్ అధికారులు . ఆదేశాలను ధిక్కరించినా, రహస్యంగా మద్యం అమ్మకాలు జరిపినా కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు.