
మందుబాబులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఈ నెల 23న హనుమాన్ జయంతి సందర్బంగా హైదరాబాద్ లో మద్యం దుకాణాలు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 23న ఉదయం 6గంటల నుండి 24వ తేదీ ఉదయం 6గంటల వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశించారు.
నిబంధనలు పాటించని దుకాణాలపై చర్యలు తప్పవని హెచ్చరించారు కమిషనర్.హనుమాన్ జయంతి సందర్భంగా సిటీలో జరిగే శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.