ఫ్రెషర్స్కు ఐటీ కంపెనీల షాక్: కొత్త కుర్రోళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేం..

ఫ్రెషర్స్కు ఐటీ కంపెనీల షాక్: కొత్త కుర్రోళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేం..

ఐటీ దిగ్గజం విప్రో ఫ్రెషర్స్ కు షాకిచ్చింది. ఈ ఏడాది ఫ్రెషర్స్ నియామకాన్ని తగ్గించుకోవాలని చూస్తోంది. కంపెనీ క్లౌంట్స్ ఖర్చులు తగ్గించుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గతేడాది 22 వేల ఫ్రెషర్లను ఉద్యోగాల్లో నియమించిన విప్పో.. ఈ ఏడాది ఫ్రెషర్స్ నియామకాల్లో కోత విధించినట్లు విప్రో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ చెప్పారు.  ఈ ప్రభావం హైదరాబాద్ లోని ఇంజనీరింగ్  విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. 

విప్రో మార్గంలో ఇతర కంపెనీలు 

విప్రోనే కాదు హైదరాబాద్ లోని ఇతర ఐటీ కంపెనీలు, దేశంలోని మెట్రో నగరాల్లో ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్నాలజీ లిమిటెడ్, టీసీఎస్ వంటి కంపెనీలు కూడా అదే బాటల నడుస్తున్నాయి. ఈ ఏడాది ఫ్రెషర్స్ నియామకాలను తగ్గిస్తున్నాయి. గత ఫైనాన్షియల్ ఇయర్ లో 50 వేల మందిని నియమించుకున్న ఇన్ఫోసిస్.. 2024 మార్చి నాటికి కాలేజీల్లో క్యాంపస్ సెలక్షన్స్ నిర్వహించే అవకాశం లేదు. 

Also Read :- విప్రో లిమిటెడ్‌‌‌‌‌‌‌‌లో 5 సబ్సిడరీలు విలీనం

ఐటీ రంగం ఫ్రెషర్స్ నియామకంలో కోత.. ఇంజనీరింగ్ కళాశాలకు అతిపెద్ద కేంద్ర మైన హైదరాబాద్ లో విద్యార్థులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ తగ్గింపు దేశంలోని జాబ్ మార్కెట్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. 

అయితే ఐటీ కంపెనీల్లో  ఫ్రెషర్స్ నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు.. ఇందుకు కారణం ఏమిటంటే.. ప్రస్తుత ద్రవ్యోల్బణం, కోవిడ్ మహమ్మారి టైంలో  అనేక దేశాల్లో ఔట్ సోర్సింగ్ లో దూకుడు నియామకాలు అని తెలుస్తోంది. 

విప్రోతో పాటు ఇతర ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ నియామకంలో విధించిన కోత హైదరాబాద్, ఇతర దేశంలోని మెట్రో నగరాల్లో ఇంజనీరింగ్ కాలేజీల క్యాంపస్ ప్లేస్ మెంట్లను ఎలా ప్రభావితం చేస్తోంది చూడాలి.