ఫలితం తేలేవరకు ఎన్ని సూపర్ ఓవర్లైనా నిర్వహించాలి : షేన్ వార్న్

ఫలితం తేలేవరకు ఎన్ని సూపర్ ఓవర్లైనా నిర్వహించాలి : షేన్ వార్న్

వరల్డ్ కప్-2019లో ఫైనల్ మంచి థ్రిల్లింగ్ గా ముగిసింది. క్రికెట్ చరిత్రలో ఇలాంటి మ్యాచ్ జరగలేదంటున్నారు స్పోర్ట్స్ విశ్లేషకులు. అయితే సూపర్ ఓవర్ లో ఫోర్ల ఆధారంగా ఫలితాన్ని తేల్చేసినదానిపై పలువురు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఆస్ట్రేలియా లెజండ్ బౌల‌ర్‌.. షేన్ వార్న్ కూడా దీనిపై స్పందించారు. వ‌ర‌ల్డ్‌క‌ప్ విజేత విష‌యంలో నిర్ణ‌యం స్ప‌ష్టంగా లేద‌న్న అభిప్రాయాన్ని వార్న్ వినిపించాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్ అద్భుతంగా సాగింద‌ని, రెండు టీయ్స్ అత్యుత్త‌మ ఆట‌ను ప్ర‌ద‌ర్శించాయ‌ని, ఆ రెండు టీమ్స్ కు కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు వార్న్ ట్విట్ట‌ర్‌ లో తెలిపాడు. కానీ మ్యాచ్ టై అయినా, సూప‌ర్ ఓవ‌ర్‌ లోనూ టై అయినా.. మ‌రో సూప‌ర్ ఓవ‌ర్‌ ను నిర్వ‌హిస్తే బాగుండేద‌ని షేన్ వార్న్ తెలిపాడు. ఒక సూప‌ర్ ఓవ‌ర్ కాక‌పోతే.. ఫలితం వ‌చ్చే వ‌ర‌కు సూప‌ర్ ఓవ‌ర్లు నిర్వ‌హించాల‌ని, దానితోనే స్ప‌ష్ట‌మైన విజేత ఎవ‌రో తెలుస్తుంద‌ని షేన్ వార్న్ త‌న ట్వీట్‌లో తెలిపాడు.

ప్రపంచకప్ అంటేనే ప్రతి ఒక్కరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఫైనల్ కప్ కోసం పోటీ పడుతారు. 4 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే వరల్డ్ కప్ ఫైనల్ లో మరో 20 నిమిషాలు కేటాయించి మరో సూపర్ ఓవర్ నిర్వహిస్తే ఏం నష్టం లేదని పలువురు చెప్పుకుంటున్నారు. వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ఇంగ్లండ్ అనూహ్య రీతిలో గెలిచింది. కివీస్‌తో మ్యాచ్ టై అయినా.. ఆ త‌ర్వాత సూప‌ర్ ఓవ‌ర్ కూడా టై అయినా.. ఇంగ్లండ్ మాత్రం బౌండ‌రీల ఆధారంగా క‌ప్‌ను ముద్దాడింది. అయితే ఈ వివాదాస్ప‌ద రూల్‌ పై ఈ విధంగా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.