మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌.. టాప్లో మోదీ

మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌.. టాప్లో మోదీ

మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్‌ల జాబితాలో  ప్రధాని నరేంద్ర మోదీ టాప్ లో నిలిచారు.  మార్నింగ్ కన్సల్ట్ సర్వే ప్రకారం 77% రేటింగ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ నాయకుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 17శాతం మంది మాత్రమే మోదీని నిరాకరిస్తున్నట్లుగా సర్వే వెల్లడించింది.   మోదీ తర్వాతి స్థానంలో మెక్సికో ప్రెసిడెంట్ మాన్యుయెల్ లోపేజ్ ఒబ్రాడోర్ నిలిచారు. ఆయన నాయకత్వాన్ని 65 శాతం మంది ప్రజలు ఆమోదిస్తుండగా.. 29 శాతం మంది తిరస్కరిస్తున్నారు.  

అర్జెంటీనా ప్రధాని జావీర్‌ మిలే ( 63%)తో అర్జెంటీనా ప్రధాని జావీర్‌ మిలే మూడో స్థానంలో,   స్విట్జర్లాండ్‌కు చెందిన అలైన్ బెర్సెట్ (57%) నాలుగో స్థానంలో,  పోలాండ్‌కు చెందిన డోనాల్డ్ టస్క్ (50%) ఐదో స్థానంలో నిలిచారు.  ఆమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాత్రం ఈ లిస్టులో 11వ స్థానంలో నిలిచారు.  ఆయన నాయకత్వాన్ని 37 శాతం మంది మాత్రమే కోరుకుంటుండగా.. 55 శాతం మంది తిరస్కరిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో మార్నింగ్ కన్సల్ట్ తన సర్వేలో  ప్రధాని మోడీ నాయకత్వానికి 76 శాతం ఆమోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా టాప్ ర్యాంకును ఇచ్చింది.