దేవుడి దయుంటే మేయర్ సీటు మాదే: ఉద్ధవ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు

దేవుడి దయుంటే మేయర్ సీటు మాదే: ఉద్ధవ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబై: బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఓటమి తర్వాత శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముంబై మేయర్ పదవి తమకే దక్కాలనేది తన కల అని, దేవుడి దయ ఉంటే అది తప్పకుండా జరుగుతుందని అన్నారు. బీఎంసీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన స్థాయిలో సీట్లు గెలవకపోవడంపై ఆయన శనివారం పార్టీ కార్యకర్తలతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా  ఉద్ధవ్  థాకరే మాట్లాడుతూ.."ముంబై మేయర్‌‌‌‌ పదవిలో  శివసేన (యూబీటీ) ఉండాలన్నదే మా కల. దేవుడు దయ చూపిస్తే అది తప్పకుండా జరుగుతుంది. ముంబైని తాకట్టు పెట్టాలని బీజేపీ కుట్ర చేస్తున్నది. అందుకే మోసపూరితంగా ఎన్నికల్లో గెలిచింది. ఈ పాపాన్ని మరాఠీ ప్రజలు ఎప్పటికీ క్షమించరు. మాపై ప్రజలకున్న విశ్వాసాన్ని బీజేపీ కొనలేకపోయింది" అని విమర్శించారు.