ఆవిరైన రూ.63వేల కోట్లు.. టాప్ టెక్ కంపెనీల్లో స్టార్ట్ అయిన కల్లోలం..

ఆవిరైన రూ.63వేల కోట్లు.. టాప్ టెక్ కంపెనీల్లో స్టార్ట్ అయిన కల్లోలం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ హెచ్1బి వీసాల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు వాటి ఫీజును ఏకంగా లక్ష డాలర్లకు పెంచారు. దీంతో వీటిపై ఎక్కువగా ఆధారపడే భారత టెక్ కంపెనీల్లో కల్లోలం స్టార్ట్ అయ్యింది. ప్రధానంగా టీసీఎస్ అత్యధికంగా 5505, ఇన్ఫోసిస్ 2004, హెచ్సీఎల్ 1728, విప్రో 1523, ఎల్ టిఐ మైండ్ ట్రీ 1884 హెచ్1బి వీసాలను పొందాయి. అయితే రానున్న కాలంలో కూడా కంపెనీలు ఈ ఫెసిలిటీని వాడుకోవాలనే నిర్ణయాన్ని కొనసాగిస్తే.. భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని నువామా అంచనా వేసింది. 

దీంతో సోమవారం మార్కెట్లు ప్రారంభం కాగానే టాప్ ఐటీ సేవల కంపెనీలైన టీసీఎస్, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో, ఎల్ టిఐ మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, పెర్సిస్టెంట్ సిష్టమ్స్ షేర్లు దాదాపు 6 శాతం తగ్గాయి. దీంతో ఈ కంపెనీల మెుత్తం మార్కెట్ క్యాప్ రూ.63వేల కోట్ల మేర కొన్ని నిమిషాల్లోనే ఆవిరైపోయింది. శనివారం టాప్ 10 టెక్ కంపెనీల మెుత్తం మార్కెట్ విలువ రూ.30లక్షల 49వేల 427కోట్లుగా ఉండగా.. ఇది ఉదయం 10 గంటల సమయానికి రూ.62వేల 722 తగ్గుదలను నమోదు చేసింది. 

ALSO READ : దసరాకు దంచికొడుతున్న గోల్డ్ రేటు..

గడచిన కొన్నాళ్లుగా ఐటీ కంపెనీలకు యూఎస్ హెచ్1బి వీసాలపై ఆధారపడటం తగ్గిందని.. భవిష్యత్తులో సంస్థలు ఆఫ్ షోర్ డెలివరీ విధానాలను అవలంబిస్తాయని నిపుణులు అంటున్నారు. అయితే తక్కువగా ఉద్యోగులను వినియోగించే టెక్ కంపెనీలు ఖర్చులను భరించగలవని వారు అంటున్నారు. ఇదే క్రమంలో బ్రోకరేజ్ జేఎం ఫైనాన్షియల్స్ యూఎస్ మార్పులు రానున్న కాలంలో లాభదాయకంగా మారతాయని.. అలాగే వ్యాపార మార్జిన్లపై ప్రభావం కూడా తక్కువగానే ఉండొచ్చని అంచనా వేసింది. ఈ క్రమంలో మార్జిన్లు 50 నుంచి 150 బేసిస్ పాయింట్లు మేర మాత్రమే తగ్గే అవకాశం ఉందని చెప్పింది. హెచ్1బి వీసా గడువు గరిష్ఠంగా 6 ఏళ్లు ఉన్నందున లక్ష డాలర్ల ఫీజు భారం ఆరేళ్లకు ఒకసారి ఉంటుందని నువామా చెప్పింది. దీనివల్ల కేవలం క్రిటికల్ రోల్స్ కోసం మాత్రమే టెక్ కంపెనీలు హెచ్1బి వీసాకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.