Gold Rate: దసరాకు దంచికొడుతున్న గోల్డ్ రేటు.. వెండి కేజీకి రూ.3వేలు పెరిగిందిగా..!

Gold Rate: దసరాకు దంచికొడుతున్న గోల్డ్ రేటు.. వెండి కేజీకి రూ.3వేలు పెరిగిందిగా..!

Gold Price Today: ప్రపంచ వ్యాప్తంగా మ్యాక్రో ఎనకమిక్ పరిస్థితులు వేగంగా మారిపోతున్న వేళ ఇన్వెస్టర్లు కూడా బంగారం, వెండిపైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు. ప్రధానంగా ప్రపంచ దేశాలు డీడాలరైజేషన్, అమెరికా ట్రెజరీ బాండ్లకు దూరం అవుతూ తమ సెంట్రల్ బ్యాంకుల ద్వారా స్థిరత్వం కోసం బంగారం, వెండినే కొనుగోలు చేస్తున్నాయి. దీంతో చరిత్రలో ఎన్నడు కనీవినీ ఎరుగని రేట్లకు ఈ లోహాల రేట్లు పెరిగిపోతున్నాయి. దసరా నవరాత్రుల సమయంలో వీటి రేట్లు భారీగా పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాపింగ్ ముందు నేటి రేట్లను తప్పక తెలుసుకోవటం ముఖ్యం. 

24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 21తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 22న రూ.430 పెరిగింది. అంటే గ్రాముకు రేటు రూ.43 పెరగటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో పెరిగిన రిటైల్ విక్రయ రేట్లు దసరా నవరాత్రుల సమయంలో భగ్గుమంటున్నాయి..

24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 22న):

హైదరాదాబాదులో రూ.11వేల 258
కరీంనగర్ లో రూ.11వేల 258
ఖమ్మంలో రూ.11వేల 258
నిజామాబాద్ లో రూ.11వేల 258
విజయవాడలో రూ.11వేల 258
కడపలో రూ.11వేల 258
విశాఖలో రూ.11వేల 258
నెల్లూరు రూ.11వేల 258
తిరుపతిలో రూ.11వేల 258

ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 21తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 22న 10 గ్రాములకు రూ.400 పెరుగుదలను చూసింది. దీంతో సోమవారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో పెరిగిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. 

22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 22న):

హైదరాదాబాదులో రూ.10వేల 320
కరీంనగర్ లో రూ.10వేల 320
ఖమ్మంలో రూ.10వేల 320
నిజామాబాద్ లో రూ.10వేల 320
విజయవాడలో రూ.10వేల 320
కడపలో రూ.10వేల 320
విశాఖలో రూ.10వేల 320
నెల్లూరు రూ.10వేల 320
తిరుపతిలో రూ.10వేల 320

బంగారం రేట్లతో పాటు మరోపక్క వెండి కూడా తమ ర్యాలీని వారం ప్రారంభంలోనూ కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 22న కేజీకి వెండి సెప్టెంబర్ 21తో పోల్చితే రూ.3వేలు పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 48వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.148వద్ద విక్రయాలు జరగుతున్నాయి.