21న బీజేపీలో వేల మంది జాయిన్ అయితరు

21న బీజేపీలో వేల మంది జాయిన్ అయితరు

తన రాజీనామాతోనే మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. పెన్షన్లు, రోడ్లు బాగు చేస్తుందని చెప్పారు. సొంత నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేయకుండా మునుగోడులో పెన్షన్ మంజూరు చేస్తున్నారని అన్నారు. సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా చౌటుప్పల్లో పాపన్న గౌడ్, ధర్మభిక్షం గౌడ్ విగ్రహాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

ఈనెల 21న బీజేపీ సభఉందని తెలిసినప్పటికీ టీఆర్ఎస్ ఈ నెల 20న సభ పెట్టడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. ఈ నెల 21న మునుగోడులో జరిగే బీజేపీ సభలో తనతోపాటు వేలాది మంది జాయిన్ అవుతున్నట్లు తెలిపారు. ప్రజలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి సభను  విజయవంతం చేయాలని చెప్పారు.