టర్న్ తీసుకుంటున్న టాప్ డైరెక్టర్స్.. దేవి శ్రీ టైమ్ వచ్చింది అంతే

టర్న్ తీసుకుంటున్న టాప్ డైరెక్టర్స్.. దేవి శ్రీ టైమ్ వచ్చింది అంతే

టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్స్ ట్రెండ్ మారుతూ వస్తోంది. ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ పని అయిపోయిందంటూ..ఇక పాత ట్యూన్స్ మాత్రమే ఇస్తున్నాడంటూ వార్తలు వస్తూనే ఉంటాయి. అవి అలానే మాత్రం ఉండవు. ఫేడ్ అవుట్ అయి..వెంటనే ఫామ్ లోకి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు.

అంతేందుకు..దేవి శ్రీ ప్రసాద్(Devi Sri Prasad) నే చూసుకుంటే..కెరీర్ స్టార్టింగ్ నుంచి సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ..బడా హీరోస్ చేత శభాష్ అనిపించుకున్నారు. కొంతకాలం అయ్యేసరికి..అలా వైకుంఠపురం సినిమా తో థమన్ చార్ట్ బ్లాస్టర్ ఆల్బమ్ ఇవ్వడంతో..డైరెక్టర్స్ అంత దేవి శ్రీ ని పక్కకు పెట్టేశారని టాక్ బలంగా వినిపించింది. ఇక దేవి పేరు వినిపించడం మాయమైపోయింది. 

ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు.. కూడా దేవి శ్రీ ప్రసాద్ ను మరిచిపోయి చరణ్ మూవీ కోసం రెహమాన్ దగ్గరకు వెళ్లిపోయారనే టాక్ కూడా వినిపించింది. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా దేవీతోనే హిట్స్ కొట్టారు. జల్సా..జులాయి..సన్నాఫ్ సత్యమూర్తి వంటి మూవీస్ తో ప్రయాణం సాగించిన..ప్రస్తుతం థమన్ ను దగ్గరకు తీసారు. ఇలా కొంతమంది మేకర్స్ దేవిని వదులుకున్నప్పటికీ..ఎక్కడ తగ్గకుండ తన దగ్గరకు వచ్చిన సినిమాలను చేసుకుంటూ పోతున్నాడు. నేషనల్ అవార్డు కూడా సాధించాడు.

ALSO  READ : గుండె బద్దలైనా, పరిస్థితి చేజారినా.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్ వైరల్

ప్రస్తుతం దేవీ తో సినిమాలు చేయడానికి..ఒక్కొక్కరు ముందుకొస్తున్నారు. డైరెక్టర్ శేఖర్ కమ్ముల కూడా దేవీ తో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. చందు మొండేటి..చై కలయికలో వస్తోన్న తండేల్ మూవీ కూడా దేవి చేతికి వచ్చినట్టు సమాచారం. ఇక సుకుమార్, హరీష్ శంకర్ సినిమాలతో దేవి ఎప్పుడు బిజీగా ఉంటాడనేది తెలిసిందే. మరిన్ని బడా ప్రాజెక్ట్స్ కి కూడా దేవి సైన్ చేసినట్లు తెలుస్తోంది