
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ(Sreeja) తన ఇంస్టాగ్రామ్ లో ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా మనపై మనకు నమ్మకం ఉండాలి అంటూ ఒక మోటివేషనల్ పోస్ట్ చేశారు ఆమె. ఆ పోస్ట్ చూసి ఎవరు స్పందించకుండా కామెంట్స్ సెక్షన్ ను హైడ్ చేశారు శ్రీజ.
ఇటీవలే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళిలో ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు శ్రీజ. తన పిల్లలతో పెళ్ళిలో ఎంజాయ్ చేసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పెళ్లి అనంతరం ఇటీవలే ఇటలీ నుండి ఇండియా వచ్చిన శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాలో జీవితానికి సంబందించిన పోస్ట్ చేశారు.. విషయాలు మన కంట్రోల్ లో లేనప్పుడు, పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మారినప్పుడు హృదయం గాయపడటంతో పాటు ముక్కలైపోతుంది, కలత చెంది క్షీణిస్తుంది. అలాంటి సమయంలో శరీరం అలసిపోయి బలహీనంగా మారుతుంది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, మనసులో బాధ ఉన్నా, గుండె బద్దలైనా, పరిస్థితి చేజారినా.. ఒక్కసారి కళ్లు మూసుకుని మనలోపలికి మనం వెళ్లగలిగితే అన్నీ సెట్ అవుతాయ్.. అంటూరాసుకొచ్చారు శ్రీజ.
ఇది చూసిన నెటిజన్స్ శ్రీజ పోస్ట్ ను షేర్ చేస్తూ.. రకరకాలుగా స్పందిస్తున్నారు. జీవితమన్నాక అన్నిరకాల పరిస్థితులు ఎదురవుతాయి. వాటిని యాక్సప్టు చేస్తూ ముందుకు వెళ్లడమే అంటూ పాజిటీవ్ కామెంట్స్ చేస్తున్నారు.