పెండ్లి పైసలతో.. అన్నదానం

పెండ్లి పైసలతో.. అన్నదానం

మంచి పని చేయడానికి మంచి మనసుంటే చాలు.. ఆస్తి, అంతస్తులు అసలు సమస్యే కాదని నిరూపించాడు ఈ ఆటో డ్రైవర్‌ అక్షయ్‌ కొత్వాలె. పూనేలో ఆటో నడుపుతున్నాడు అక్షయ్‌. ఈ నెల 25న పెండ్లి. ఖర్చుల కోసం చాలా రోజుల క్రితమే రెండు లక్షల రూపాయలు జమ చేశాడు. ఆ టైంలోనే గవర్నమెంట్‌‌ లాక్‌ డౌన్‌ విధించింది. పనిలేక ఎంతో మంది ఆకలితో అలమటించారు. అది చూడలేక, వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నా డు. పెండ్లి వాయిదా వేసుకుని, ఆ డబ్బుతో పేదల ఆకలి తీరుస్తున్నాడు. ప్రతి రోజు సుమారు 400 మందికి సరిపోయే ఫుడ్‌‌ వండి, పేదలకు, వలస కూలీలకు పెడుతున్నాడు.

అందుకోసం రెండు లక్షలు ఖర్చు చేశాడు. ఆయనతో మరో ముగ్గురు ఫ్రెండ్స్‌‌ కూడా కలిశారు. నలుగురు కలసి.. ప్రతి రోజు ఉదయం కిచిడి, పులావ్, సాంబార్ రైస్ వండుతారు. తర్వాత ఫుడ్‌‌ని ఆటోలో వేసుకుని, పూనేలోని 4-5 ఏరియాలకు వెళ్లి పంచుతారు. మార్చి 23 నుంచి ప్రతి రోజూ వీళ్ల డైలీ రొటీన్‌ ఇదే. మే 31 వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానంటున్నాడు అక్షయ్‌ . అంతేకాదు లాక్‌ డౌన్
వల్ల ఇబ్బంది పడ్డ సీనియర్‌ సిటిజన్స్, గర్భిణుల కోసం ఆటో కూడా నడిపాడు. ఈయనకు సేవ చేయడం కొత్తే మీ కాదు. గతంలో వరదలు వచ్చి నప్పుడు కూడా ఎంతోమందికి అన్నం పెట్టి ఆదుకున్నాడు అక్షయ్‌.