
ఆకు కూరలు ఆరోగ్యానికి మంచిది. అందుకే డాక్టర్లు సైతం ఆకు కూరలను ఎక్కువగా తినాలని చెప్తుంటారు. మార్కెట్లో ఎక్కడ తాజా ఆకు కూరలు కనిపించినా సరే..ప్రజలు వాటిని కొనుక్కుంటారు. ఇష్టంగా వండుకుని ఆరగిస్తుంటారు. అయితే మరి మార్కెట్లో కనిపించే ఆకుకూరలన్నీ తాజావేనా.. రైతులు తామ పండించిన ఆకుకూరలను తెంచి ఉదయాన్నే మార్కెట్లకు తరలిస్తుంటారు. కానీ మార్కెట్లకు వచ్చేలోగా కొద్దిగా అయినా వాడిపోతుంటాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లలో సాయంత్రం కూడా ఆకుకూరలు తాజాగా ఎలా ఉంటాయనే సందేహం మీకెప్పుడైనా వచ్చిందా..అందుకే వ్యాపారులు ఏం ఉపయోగిస్తారో తెలుసా..
రసాయనాల్లో ముంచుతున్నరు
గ్రామాల నుంచి తీసుకువచ్చిన ఆకు కూరలు వాడిపోవడం సాధారణం. అయితే వ్యాపారులు వినియోగదారులను ఆకట్టుకుందుకు వాటిని తాజాగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే రసాయనాలను ఉపయోగిస్తున్నారు. వాడిపోయిన ఆకుకూరలను కెమికల్స్ లో ముంచి తీస్తున్నారు. దీని వల్ల వాడిపోయిన ఆకు కూరలు తాజాగా మారిపోతున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వాడిపోయిన పాలకూర..ఫ్రెష్గా మారింది
ఈ వీడియోలో పాలకూర వాడిపోయి ఉంది. ఆ పాలకూర కట్టను ఓ రసాయనంలో ముంచి తీశారు. అప్పటి వరకు వాడిపోయి ఉన్న పాలకూర కెమికల్స్లో ముంచగానే ఫ్రెష్ గా మారింది. దీన్ని చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు. ఇన్నాళ్లు మార్కెట్లలో కొనుగోలు చేసిన ఆకు కూరలు తాజావేనా అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.