విజయంతో ముగింపు: వెస్టిండీస్‌‌పై ఇండియా విక్టరీ

విజయంతో ముగింపు: వెస్టిండీస్‌‌పై  ఇండియా విక్టరీ

లాడర్‌‌హిల్స్:  వెస్టిండీస్‌‌తో ఐదు టీ20ల సిరీస్‌‌ను ఇండియా ఘన విజయంతో ముగించింది. శ్రేయస్‌‌ అయ్యర్‌‌ (40 బాల్స్‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 64) క్లాసిక్‌‌ ఇన్నింగ్స్‌‌కు తోడు రవి బిష్ణోయ్‌‌ (4/16 ), కుల్దీప్‌‌ యాదవ్‌‌ (3/12), అక్షర్‌‌ పటేల్‌‌ (3/15) స్పిన్‌‌ మ్యాజిక్‌‌ చూపెట్టడంతో ఆదివారం జరిగిన చివరి, ఐదో టీ20లో ఇండియా 88  రన్స్‌‌ తేడాతో విండీస్‌‌ను చిత్తు చేసింది.  తొలుత టీమిండియా 188/7 స్కోరు చేసింది. హుడా (38),  స్టాండిన్‌‌ కెప్టెన్‌‌ హార్దిక్‌‌ (28) రాణించారు. ఛేజింగ్‌‌లో15.4 విండీస్‌‌  100   కే కుప్పకూలింది. హెట్‌‌మయర్‌‌ (56) టాప్‌‌ స్కోరర్‌‌. ఈ విజయంతో సిరీస్‌‌ను 4–1తో సొంతం చేసుకుంది.  అక్షర్​ ప్లేయర్‌‌ ఆఫ్ ద మ్యాచ్‌‌,  అర్ష్ దీప్​ ప్లేయర్‌‌ ఆఫ్‌‌ సిరీస్‌‌ అవార్డులు దక్కాయి.