20 ఏళ్ల యువతిని అడవిలో బంధించి 14 రోజలపాటు అత్యాచారం

V6 Velugu Posted on Nov 26, 2020

రాజస్థాన్‌లో దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ 20 ఏళ్ల యువతిని అడవిలో బంధించి 14 రోజులు పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ యువకుడు. యువతి నవంబర్ 9న తన మామ ఇంట్లో జరిగే వివాహానికి వెళ్లింది. అక్కడ ఆమె అహ్లాదంగా ఉన్న ప్రకృతిని చూస్తూ మామ ఇంటి నుంచి బయటకు వెళ్లింది. బుండి జిల్లాలోని కప్రేన్‌కు చెందిన ఫోరులాల్ ఆడ్ అది గమనించి.. ఇంకా మంచి ప్రదేశాలు చాలా ఉన్నాయని.. తనతో వస్తే చూపిస్తానని చెప్పి ఆమెను మోటారుసైకిల్‌ మీద కోట జిల్లాలోని మందనా సమీపంలో ఉన్న ఒక అడవికి తీసుకెళ్లాడు. అక్కడ ఫోరులాల్.. యువతిని బంధించి 14 రోజుల పాటు అత్యాచారం చేశాడు. ఆమెకు చెందిన వస్తువులన్నీ ఒక పక్కన పడేశాడు. నవంబర్ 22న ఫోరులాల్ లేని సమయంలో యువతి తన ఫోన్ వెతికి తన తండ్రికి సమాచారమిచ్చింది. దాంతో ఆమె తండ్రి ఆమెను వెతుక్కుంటూ వచ్చి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి తన తండ్రితో కలిసి బారన్ జిల్లాలోని ఆంటా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలింపు చేపట్టామని స్టేషన్ ఆఫీసర్ ఉమేష్ మనరియా తెలిపారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించామని.. అంతకుముందు ఆమె స్టేట్‌మెంట్‌ను మేజిస్ట్రేట్ నమోదు చేశారని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.

For More News..

బోట్ ఫ్యూయల్ ట్యాంకులో డ్రగ్స్ రవాణా

బర్త్‌డే రోజే సూసైడ్ చేసుకున్న మైనర్ బాలుడు

21 ఏండ్లలో ఒక్క ప్రమోషన్‍ ఇయ్యలె.. రిటైర్మెంటప్పుడు కూడా అదే పోస్ట్ , అదే జీతం

Tagged Rape, rajastan, abducted, Bundi district., Baran district, Kota Jungle

Latest Videos

Subscribe Now

More News