AP గ్రామీణ బ్యాంక్ కు బాంబు బెదిరింపు

AP గ్రామీణ బ్యాంక్ కు బాంబు బెదిరింపు

తమ గ్రూపుకు లోన్లు ఇవ్వలేదన్న కారణంతో బ్యాంకులో బాంబు ఉందని  ఫోన్ ద్వారా మెసెజ్ లు పంపింది ఓ అజ్ణాత వ్యక్తి. దీనితో అదిరిపడ్డ బ్యాంకు మేనేజర్ పోలీసులు ఫిర్యాదు చేయగా.. దీనికంతటికి కారణం ఓ  డ్వాక్రా గ్రూపు లీడర్ దాచేపల్లి వీర శివరంజనిగా గుర్తించారు. విశాఖపట్నం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందీ ఘటన. నగరంలోని స్థానిక గోండా జంక్షన్ లో ఉన్న APGV బ్యాంకు మేనేజర్ కిరణ్ కుమార్ తమకు సకాలంలో లోన్ లు ఇవ్వడం లేదనే ఈ పని చేసినట్టు ఆమె తెలిపింది.

ఈ మెసేజ్ లు అన్నీ తానే పెట్టానని,  కేవలం బ్యాంకు మేనేజర్ ను బెదిరించాలని మాత్రమే ఈ మెసేజ్ పెట్టినట్టు పోలీసులకు నిజం చెప్పింది . తన కింద 35 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయని, ఆ గ్రూపుల సభ్యులకు  లోన్లు, ప్రభుత్వ పథకాలు జారీ చేయడంలో బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యం వహించినందుకే ఈ పని చేసినట్టు తెలిపింది. ఇంత గందరగోళానికి కారణమైన ఆమెను అరెస్టు చేసామని డిఎస్పి ప్రసాదరావు తెలిపారు.