వేధిస్తే చెప్పుతో కొట్టాలని పంచాయతీ తీర్పు

వేధిస్తే చెప్పుతో కొట్టాలని పంచాయతీ తీర్పు

సమాజంలో మహిళలు, యువతులు, విద్యార్ధినులకు ఆకతాయిల నుంచి రక్షణ కరువైంది. పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్‌లు, చివరకు కాలనీల్లోనూ మహిళలకు వేధింపులు ఎదురవుతున్నా యి.  ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా ఆకతాయిలు మాత్రం మారడం లేదు.  తాజాగా ఓ యువకుడు మహిళను వేధించాడు.  ఇలా చేయవద్దని ఎన్ని సార్లు చెప్పినా వినకపోవడంతో స్థానికంగా ఉండే  గ్రామ పంచాయతీ పెద్దలకు ఫిర్యాదు చేసింది.  ఆమె ఫిర్యాదు ను పరిశీలించిన గ్రామ పంచాయతీ  చెప్పుతో కొట్టాలని  తీర్పు ఇచ్చిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని హాపూర్ జిల్లాలో జరిగింది. ఈ నేపథ్యంలో అంతా చూస్తుండగా ఆ వ్యక్తిని యువతి చెప్పుతో కొట్టింది (Woman beats man with slipper). ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. 

స్థానిక  వ్యక్తి తనను వేధిస్తున్నట్లు ఒక యువతి ఆరోపించింది. దీని గురించి ఆ  గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేసింది. దీంతో  ఆ గ్రామ పంచాయతీ వినూత్నంగా తీర్పు ఇచ్చింది. వేధిస్తున్న యువకుడ్ని చెప్పుతో కొట్టాలని ఆ యువతికి చెప్పింది. దీంతో పంచాయతీ తీర్పును ఆ యువతి అమలు చేసింది. జనమంతా చూస్తుండగా ఆ వ్యక్తిని చెప్పుతో పలుమార్లు కొట్టింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో పంచాయతీ తీర్పుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.