ఉప్పల్, వెలుగు: ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి ఓ గృహిణి మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన శ్రీరాములు, భారతి భార్యభర్తలు. 20 ఏండ్ల క్రితం బతుకుతెరువు కోసం నగరానికి వచ్చారు. రామంతాపూర్ కేసీఆర్ నగర్లోని బాలకృష్ణ కాలనీలో అద్దెకు ఉంటూ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
గురువారం ఉదయం నల్లా నీరు వస్తున్న సమయంలో భారతి సంపు తెరిచి వాల్ బంద్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో సంపులో పడడంతో తలకు గాయమై మృతిచెందింది. పోలీసులు డెడ్‌బాడీని గాంధీ మార్చురీకి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
