
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సుభాష్ నగర్లో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. ఉదయం తను నివాసం ఉండే ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి లక్ష్మి(25)ఆత్మహత్యకు పాల్పడింది. లక్ష్మి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా అని పోలీసులు గుర్తించారు. లక్ష్మి ఆత్మహత్యతో ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
హైదరాబాద్ నగర పరిధిలో ఆత్మహత్యలు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది..క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయంతో జీవితాలు అర్దాంతరంగా ముగించేస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన మరో ఘటనలో భార్యాభర్తలు హార్పిక్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తట్టుకోలేక రాజేంద్రనగర్పోలీస్స్టేషన్పరిధిలోని ఓ ఇంట్లో భార్యాభర్తలు టాయిలెట్క్లీనర్తాగారు. భార్య మృతి చెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ఎర్రబోడ ఏరియాకు చెందిన రమేశ్(45), రాజేశ్వరి(35) భార్యభర్తలు.
రమేశ్స్థానికంగా పనులకు వెళ్లడంతోపాటు సీజనల్గా పండ్లు విక్రయిస్తుంటాడు. రాజేశ్వరి అతనికి సహాయకురాలిగా వెళ్తుంది. కొన్నాళ్లుగా వీరు ఆర్థిక ఇబ్బందులతోపాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తట్టుకోలేక శనివారం ఇంట్లో హార్పిక్తాగారు. కడుపులో పేగులు కాలిపోవడంతో రాజేశ్వరి మృతి చెందింది. రమేశ్పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.