తాళిని లంచంగా తీసుకుని..నా భూమిని నాకు ఇప్పించండి

తాళిని లంచంగా తీసుకుని..నా భూమిని నాకు ఇప్పించండి

తన పేరుమీద ఉన్న వ్యవసాయ భూమిని వేరేవాళ్లకు పట్టా చేశారంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తహశీల్దార్ ఆఫీసు ముందు మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. తన తాళిబొట్టును తహశీల్దార్ ఆఫీస్ దర్వాజకు వేలాడదీసింది. దాన్ని లంచంగా తీసుకుని తన భూమి తనకు ఇచ్చేయాలని కోరింది. రుద్రంగి మండలం మానాలకు చెందిన పొలాస రాజేశం, మంగకు సర్వే నెంబర్ 130/14 లో 2 ఎకరాల భూమి ఉంది. మూడేళ్ల క్రితం రాజేశం చనిపోయారు. అయితే.. ఆయన పేరిట ఉన్న భూమిని వేరేవాళ్లకు రిజిస్ట్రేషన్ చేశారని మంగ అంటున్నారు. తన భూమి తనకు ఇవ్వాలని మూడేళ్లుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అడిగితే ఫైల్ పోయిందని.. ఆర్డీఓ ఆఫీస్ కు వెళ్లాలని చెబుతున్నారన్నారు.

 
Woman Farmer Protest at Tahsildar Office against Illegal Land Registration | Sircilla | V6 News

నా తాళినే లంచంగా తీసుకుని.. నాకు భూమి ఇప్పించండి #WomanProtest #TahsildarOffice #LandRegistration #Sircilla #V6Velugu

Posted by V6 News on Wednesday, June 30, 2021