అక్కడ అంతే..మహిళలు గట్టిగా అరిస్తే జైలు శిక్షే...

అక్కడ అంతే..మహిళలు గట్టిగా అరిస్తే జైలు శిక్షే...

అమెరికా టిక్ టాకర్ ఎరక్కపోయి దుబాయ్ లో ఇరుక్కుపోయింది. తన స్నేహితుడితో జాలీ ట్రిప్ కోసం యూఏఈ వెళ్లిన టియెర్రా యంగ్ అలెన్ అనుకోకుండా అక్కడ యాక్సిడెంట్ చేసింది. పబ్లిక్‌లో గట్టిగా కేకలు పెట్టినందుకు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. అరిచినందుకే అరెస్ట్ చేస్తారా..అనుకోవచ్చు కానీ...దాని వెనకాల ఓ పెద్ద కథ ఉంది. 

దుబాయ్ పోలీసులు టెక్సాస్‌కి చెందిన ఓ మహిళను అరెస్ట్ చేశారు. టెక్సాస్‌లోని హూస్టన్‌కి చెందిన టియెరా యంగ్‌ అలెన్ ఫ్యామిలీ దాదాపు రెండు నెలలుగా దుబాయ్‌లోనే స్ట్రక్ అయిపోయింది. ఫ్యూచర్ ఏంటో అర్థం కాక తెగ టెన్షన్ పడుతోంది ఆ కుటుంబం. తన కూతురి పాస్‌పోర్ట్‌ని దుబాయ్ పోలీసులు సీజ్ చేశారని చెబుతోంది అలెన్. హూస్టన్‌లో ట్రక్‌ డ్రైవర్‌గా పని చేస్తోంది యంగ్ అలెన్. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా. ప్రస్తుతం ఆమెపై ట్రావెల్ బ్యాన్ విధించారు. పోలీసులు ఆమెని విచారిస్తున్నారు. 

అమెరికాకు చెందిన టిక్ టాక్ స్టార్ టియెర్రా యంగ్ అలెన్(29) యూఏఈ పర్యటనకు వచ్చి చిక్కుల్లో పడింది. దుబాయ్ లో తన స్నేహితుడితో కలిసి ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంటుకు గురి కావడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవింగ్ చేస్తున్నందుకు బాయ్ ఫ్రెండ్ ను అరెస్టు చేశారు. టిక్ టాకర్ స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.  దాదాపు వారం రోజుల పాటు కస్టడీలో ఉంచుకుని ఆ తరువాత విడుదల చేశారు. అతడితో పాటు కార్‌లో ఉన్న అలెన్ క్రెడిట్ కార్డ్‌లు,ఐడీ కార్డ్‌లతో పాటు పర్సనల్ ఐటమ్స్‌నీ స్వాధీనం చేసుకున్నారు. వాటిని కలెక్ట్ చేసుకునేందుకు అలెన్ వెళ్లింది. 

ఇక్కడే అధికారులు తిరకాసు పెట్టారు. డబ్బులు కడితే తప్ప అవన్నీ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. ఇవ్వాల్సిందేనని అలెన్ డిమాండ్ చేసింది. దీంతో అక్కడ ఓ అధికారి ఆమెపై గట్టిగా అరిచాడు. అప్పటికే సహనం కోల్పోయిన అలెన్ కూడా ఆ అధికారిపై గట్టిగా అరిచింది. ఇక అంతే...వెంటనే దుబాయ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. . దుబాయ్‌లో మహిళలు ఎవరూ గొంతు పెంచి మాట్లాడడానికి వీల్లేదు... గట్టిగా అరవకూడదు. అలా చేస్తే పోలీసులు ఊరుకోరు. కేసు నమోదు చేసి జైల్లో పెడతారు. ఇప్పుడు అలెన్‌కి అదే జరిగింది. మిగతా దేశాలతో పోల్చి చూస్తే UAEలో పబ్లిక్ కండక్ట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. దుబాయ్‌ పర్యటనకు వచ్చే అమెరికన్లు ఎవరైనా సరే...ఇక్కడి రూల్స్‌ని దృష్టిలో పెట్టుకుని నడుచుకోవాలని అధికారులు వార్నింగ్ ఇచ్చారు