నీళ్లల్లో బతుకమ్మలను వదిలి మొక్కులు చెల్లించుకున్నరు

నీళ్లల్లో బతుకమ్మలను వదిలి మొక్కులు చెల్లించుకున్నరు

తొమ్మిది రోజులపాటు గడప గడపను పలకరించి, ప్రతి గొంతులో పాటలను కైగట్టి ఉయ్యాలలూగిన బతుకమ్మ.. సోమవారం రాత్రి గంగమ్మ ఒడిని చేరింది. సద్దుల బతుకమ్మ సంబురాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. గునుగు, తంగేడు, బంతి, చామంతి, దశన్న.. వంటి తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి, బొడ్రాయి దగ్గర ఉంచి ఆడబిడ్డలు ఆడి పాడారు. అనంతరం చెరువు కట్టకు చేరుకొని.. ‘‘ఇసుకల పుట్టే గౌరమ్మ ఇసుకలో పెరిగే గౌరమ్మ.. ఇసుకలో వసంతమాడంగా పోయిరా గౌరమ్మ’’ అంటూ నీళ్లల్లో బతుకమ్మలను వదిలి మొక్కులు చెల్లించుకున్నారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు.