
డెంగ్యూ జ్వరంతో ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు జడ్జి ఎం జయమ్మ ఆకస్మికంగా మృతి చెందారు. కొద్దిరోజులుగా ఆమె హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారు. అయితే జయమ్మ ఇవాళ(సోమవారం) తెల్లవారుజామున రెండు గంటలకు మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. హైకోర్టు విభజనలో భాగంగా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా పనిచేసిన జయమ్మ గతేడాది డిసెంబర్లో ఖమ్మం రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ అయ్యారు.