ఇలా కూడా జరుగుతుందా..? వరుడిపై యువతి యాసిడ్ దాడి

ఇలా కూడా జరుగుతుందా..? వరుడిపై యువతి యాసిడ్ దాడి

యాసిడ్ అటాక్ ఎప్పుడూ అమ్మాయిలపైనే  జరుగుతుందని అనుకోవద్దు. బాయ్స్ లో కూడా యాసిడ్ దాడి బాధితులు ఉంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బల్లియాలో తాజాగా జరిగిన ఘటన ఇందుకు నిదర్శనం.  ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోకుంటే అబ్బాయిలు యాసిడ్ దాడికి పాల్పడతారు. ఇలాంటి వార్తలు తరుచుగా వింటుంటాం.. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. బల్లియాలోని బన్స్‌డిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుమారి గ్రామంలో ఏప్రిల్ 23న రాకేష్ బింద్ పెళ్లి వేడుక జరుగుతోంది.  పెళ్లి మండపానికి వరుడిని ఉరేగింపుగా తీసుకెళ్తున్నారు. అంతలో పెళ్లి కూతురి డ్రస్ లో ఓ యువతి అక్కడికి వచ్చి.. రాకేష్ తనవాడు అతన్ని తననుంచి ఎవరూ దూరం చేయలేరంటూ.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని కోరింది. 

అయితే రాకేష్ అందుకు నిరాకరించాడు. వెంటనే యువతి తనతో తెచ్చుకున్న యాసిడ్ బాటిల్ ను అతనిపై విసిరింది. రాకేష్ తోపాటు అతని పక్కనున్న ముగ్గురు మహిళలపై కూడా యాసిడ్ పడి వారు గాయపడ్డారు. పెళ్లి కొడుకుపై యాసిడ్ దాడి చేసిన యువతిని వరుడి బంధువులు పట్టుకుని చితక్కొట్టారు. కొడుతూ ఉరేగించి, అనంతరం పోలీసులకు అప్పగించారు.  దాన్ని వీడియో తీసి ఇంటర్నెట్ లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరలైంది. మహిళపై సెక్షన్ 326 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. యాసిడ్ దాడిలో గాయపడిన వారిని హాస్పిటల్ లో చేర్చారు. తర్వాత పెళ్లి తంతు పూర్తిచేశారు.