
కొన్ని అసభ్యకర ఘటనలతో ఇటీవలే ఢిల్లీ మెట్రో (Delhi Metro) తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. నిత్యం రద్దీగా ఉండే మెట్రో రైలులో ప్రయాణికుల చేష్టలు, అక్కడ చోటుచేసుకునే వింత పోకడలకు సంబంధించిన వీడియోలు (Viral Video) తరచూ సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. అసభ్యకర చేష్టలు, ముద్దుసీన్లు, డ్యాన్స్ రీల్స్, ఘర్షణలు వంటి వీడియోలు చర్చకు దారితీశాయి. ఇప్పుడుమరో వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
Delhi Metro में अश्लील नाच- गाना और Reel, भोजपुरी गाने पर थिरकी लड़की, #VIDEO हो रहा वायरल। नहीं कोई शर्म , लड़की का नाम मनीषा डांसर , दिल्ली से लेकर मुंबई में पहले भी #reels बनाने को लेकर हो चुकी है कार्रवाई , उसके बाद भी कानून का नहीं डर।#Delhimetro #Delhi #Reel #instagram… pic.twitter.com/hVdDFqzDeS
— निशान्त शर्मा (भारद्वाज) (@Nishantjournali) July 21, 2024
వైరల్ వీడియోలో ఒక అమ్మాయి మెట్రోలో భోజ్‌పురి పాటపై డ్యాన్స్ చేస్తోంది. అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు అమ్మాయి డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ వీడియో మహిళా కోచ్‌లో తీసినట్టుగా తెలుస్తోంది. ఈ అమ్మాయి మెట్రోలో భోజ్‌పురి పాటలకు డ్యాన్స్ చేస్తూ వీడియో చివర్లో ఫ్లయింగ్ కిస్ కూడా ఇస్తూ కనిపించింది. ఇంటర్‌నెట్‌లో వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో వైరల్‌గా మారడంతో జనాలు దీనిపై రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై డిఎంఆర్‌సి ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పుడు నా కుటుంబంతో కలిసి ఢిల్లీ మెట్రోకు వెళ్లాలంటే భయంగా ఉందని ఒకరు రాశారు.ఇది అమ్మాయి తప్పు కాదని, ప్రజలు మౌనంగా ఉన్నప్పుడు ఇలాంటి వారు ఏదైనా చేస్తారని మరొక యూజర్ రాశారు. మెట్రో అశ్లీల డెన్‌గా మారుతోందని ఇంకొకరురాశారు. మెట్రో ప్రయాణికులు స్వయంగా ముందుకు వచ్చి ఇలాంటి వారికి గుణపాఠం చెప్పాలని కామెంట్చేయగా... . ఇలాంటి అమ్మాయిలను పట్టుకుని కనీసం ఒక రోజైనా జైల్లో ఉంచాలని, బహుశా అలా చేస్తేనే వారిలో మార్పు వస్తుందేమోనని రాసుకొచ్చారు.. మరికొందరైతే., చుట్టుపక్కల ఉన్నవారు దానిపై రియాక్ట్ కానంత వరకు ఇలాంటివారు చేసే పనులు చేసేస్తారు అంటూ కామెంట్ చేస్తున్నారు.
Also Read:-లావైపోతున్నారు... బానపొట్టలు.. ట్రంకు పెట్టెల్లా బాడీలు
ఢిల్లీ మెట్రోలో డ్యాన్స్ చేస్తున్న ఈ అమ్మాయి పేరు మనీషా డాన్సర్. ఇటీవల, ముంబైలో కూడా ఇలాగే అశ్లీల డాన్స్ చేస్తూ హల్‌చల్ చేసింది. రైళ్లు, స్టేషన్లలో ఇదే పద్ధతిలో డ్యాన్స్ రీల్స్ చేస్తుండగా ..ముంబై RPF ఈ అమ్మాయిపై చర్య తీసుకుంది. దాంతో ఆమె వారిని క్షమాపణ కోరి తప్పించుకుంది. ఇప్పుడు, ఢిల్లీ మెట్రోలో అదే సీన్ రిపీట్ చేసింది. ఒకసారి పోలీసులకు క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా ఈ అమ్మాయి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు