32 ఏళ్ల మహిళ.. మూడు రోజులు లిఫ్ట్ లోనే.. తరువాత ఏమైంది?

32 ఏళ్ల మహిళ.. మూడు రోజులు లిఫ్ట్ లోనే.. తరువాత ఏమైంది?

లిఫ్ట్ లో ఉన్నప్పుడు ఒక్క క్షణం పవర్ పోతే లిఫ్ట్ స్టాప్ అయి ఊపిరంతా ఆగిపోయినట్లు అనిపిస్తుంది. అలాంటిది ఓ మహిళ 3 రోజుల పాటు ఓ లిఫ్ట్ లో ఇరుక్కుని నరకయాతన అనుభవించింది. అరిచింది. .. సాయం చేయాలని అర్థించింది.. కానీ విధి ఆమె పట్ల చిన్న చూపు చూసింది. లిఫ్ట్ లోనే ప్రాణాలు విడిచింది. 

ఈ ఘటన ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాష్కెంట్లో పోస్ట్ ఉమెన్ గా పని చేస్తున్న ఓల్గా లియోనటేవా అనే 32 ఏళ్ల మహిళ డ్యూటీలో భాగంగా 9 అంతస్థుల బిల్డింగ్లోని వెళ్లింది. లిఫ్ట్ ఎక్కి లాస్ట్ అంతస్థుకు చేరుకోవాలనుకుంది. 

8 వ ఫ్లోర్ దాటగానే లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో ఎవరైనా సాయం చేస్తారేమోనని చాలా సేపు ఎదురు చూసింది. ఎంతసేపటికీ రాకపోవడంతో భయంతో కేకలు వేసింది. కానీ ఏం లాభం ఆ అరుపులు ఎవరికీ వినిపించలేదు. దీంతో క్రమంగా లిఫ్ట్ లో ఆక్సిజన్ లెవల్స్ తగ్గడం ప్రారంభించాయి. అరిచి అరిచి.. అలసిపోయిన ఆమె లిఫ్ట్ లోనే స్పృహ కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు విడిచింది. 

మరణంపై అనుమానాలు..

ఓల్గా కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఆమె మృతదేహాన్ని లిఫ్ట్ లో ఉన్నట్లు గుర్తించారు. మూడ్రోజులు వెతికిన అనంతరం ఆమె డెడ్ బాడీ లభ్యం అయింది. భయందోళన, ఊపిరి ఆడకపోవడం వల్లే ఆమె చనిపోయినట్లు పోస్టు మార్టం రిపోర్ట్ వెల్లడించింది. 

అయితే ఆమె మరణంపై  కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. లిఫ్ట్ 3 రోజులపాటు ఎందుకు వాడకుండా ఉన్నారు. ఘటన ప్రమాదమేనా.. ఇంకేవైనా కారణాలున్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.