
మెదక్(శివ్వంపేట), వెలుగు: మెదక్జిల్లాలో వివాహేతర సంబంధం పెట్టుకున్న వ్యక్తే ఓ మహిళను దారుణంగా హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్దాపూర్ కాలనీకి చెందిన వడ్డెరి నరసమ్మ అలియాస్రేణుక(32)ను భర్త వదిలేశాడు. కొన్నాళ్లుగా ఆమె హత్నూర మండలం పల్పనూరు గ్రామానికి చెందిన తాపీ మేస్త్రీ వడ్డే రాములుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
అతని దగ్గరే ఉంటూ.. కూలి పనులకు వెళ్తోంది. అయితే రేణుక తరచూ డబ్బులు ఇవ్వాలని గొడవ పడుతుండడంతో ఆమె అడ్డు తొలగించుకోవాలని రాములు స్కెచ్వేశాడు. బుధవారం బయటకు తీసుకెళ్లి శివ్వంపేట మండలం చాకరిమెట్ల శివారులో చీర కొంగుతో గొంతు బిగించి చంపేశాడు. మృతురాలి తమ్ముడు రాజు ఫిర్యాదు మేరకు శివ్వంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. రాములును అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు ఎస్సై రవి కాంతారావు తెలిపారు.