ఆడ పిల్లలు పుట్టారని భార్యను ఇంటి నుంచి తరిమేసిన భర్త

ఆడ పిల్లలు పుట్టారని భార్యను ఇంటి నుంచి తరిమేసిన భర్త

ఆడపిల్లలు పుట్టారని ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి ముగ్గురు పిల్లలను భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో బాలింతైన భార్య అత్తారింటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. సైదాబాద్ ఇంద్రప్రస్తాన్ కాలనీకి చెందిన గోరెంకా శ్రీకాంత్ వృత్తిరీత్యా సాఫ్ట్ వైర్ ఉద్యోగం చేస్తాడు. 2014లో శ్రీకాంత్ తో సైదాబాద్ కు చెందిన స్వప్నకు పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. 12 లక్షల కట్నం, 25 తులాల బంగారం ఇచ్చారు. వీరికి మొదటి కాన్పులో ఆడ పిల్లల పుట్టింది. దీంతో ఆడపిల్లల పుట్టిందని శ్రీకాంత్ భార్యను పాపను ఇంటి నుండి తరిమేశాడు. పెద్దల సమక్షంలో రాజీ కుదరడంతో మళ్ళీ భార్యను ఇంటిలోకి రానిచ్చాడు. 

రెండో కాన్పులో ఒక బాబు, ఒక పాప పుట్టింది.. మళ్ళీ పాప పుట్టిందని ఇంటి నుంచి తరిమేశాడు. ఈ సారి ఆ బాలింత మహిళ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమెకు మహిళ సంఘాలు మద్దతు పలికాయి. భార్యను పిల్లలను ఇంట్లోకి తీసుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని మహిళ సంఘాలు తెలిపాయి. మహిళ సంఘాలు ధర్నా చేయడంతో ఇంటిపై నుంచి శ్రీకాంత్ వీడియో తీయడంతో మహిళ సంఘాలు ఆగ్రహంతో ఇంట్లోకి చొరబడటానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక సైదాబాద్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి విచ్చేసి బాధితురాలికి మద్దతుగా నిలిచి, భర్త కుటుంబంతో మాట్లాడి బాధితురాలిని, పిల్లలతో ఇంట్లోకి పంపించారు.