
అత్తింటి వేధింపులతో వివాహిత సూసైడ్
జీడిమెట్ల,వెలుగు: అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత సూసైడ్ చేసుకున్న ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో జరిగింది. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన ఎన్. పద్మ రెండో కూతురు స్వప్న(29)కు 2013 ఫిబ్రవరిలో పర్వతగిరి మండలం ఎనుగల్లు గ్రామానికి చెందిన యాకయ్య కుమారుడు రంజిత్ తో పెండ్లి జరిగింది. రంజిత్, స్వప్న సిటీకి వచ్చి చింతల్ ప్రసన్ననగర్‌లో ఉంటున్నారు. రంజిత్ జీడిమెట్లలోని ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కొంతకాలంంగా స్వప్న అత్త సావిత్రి, భర్త రంజిత్, అతడి మేనమామ ఎన్.రాజు, మరిది అనిల్ అదనపు కట్నం తీసుకురావాలని స్వప్నను వేధించడం మొదలుపెట్టారు. ఆమె పర్వతగిరి పీఎస్ లో కంప్లయింట్ చేయడంతో పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ఈ నెల 11వ తేదిన స్వప్న సోదరుడి పెళ్లి ఉండటంతో ఆడబిడ్డ కట్నం కింద రూ.2 లక్షలు ఇవ్వాలని అత్తింటి వారు డిమాండ్ చేశారు. అలా ఇస్తే స్వప్నను సోదరుడి పెళ్లికి పంపిస్తామన్నారు. స్వప్న తల్లిదండ్రులు అందుకు ఒప్పుకున్నారు. సోదరుడి పెళ్లి తర్వాత ఈ నెల 26న సిటీకి చేరుకున్న స్వప్న 27న సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. జీడిమెట్ల పోలీసులు డెడ్ బాడీని ఉస్మానియాకు తరలించారు. అత్తింటి వేధింపుల వల్లే తన కుమార్తె సూసైడ్ చేసుకుందని స్వప్న తల్లి పద్మ పీఎస్ లో కంప్లయింట్ చేసింది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
For More News..
గతేడాదితో పోలిస్తే 50 శాతం పెరిగిన సైబర్ కేసులు
లోకల్ గేదెలు కొంటే లోన్ ఇవ్వరంట
ఇల్లీగల్ పనులు చేస్తే రూమ్‌లో వేసి తంతా..! మున్సిపల్ ఆఫీసర్లకు చైర్మన్ వార్నింగ్