మహిళను హత్యచేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు

మహిళను హత్యచేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు

రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది.  ఓ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు.  శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఆగస్టు 10 వ తేది( గురువారం) అర్థరాత్రి 11 గంటలకు  కిషన్ గుడా దగ్గర  శ్రీనివాస ఎన్ క్లేవ్  లో ఇళ్ల స్థలాల మధ్య గుర్తు తెలియని మహిళను  హత్య చేసి  పెట్రోలో పోసి నిప్పంటించారు. మృతదేహాం పూర్తిగా కాలిపోయింది.

అర్థరాత్రి మంటలు రావడం చూసి గమనించిన  స్థానికులు ఎయిర్ పోర్ట్ పోలీసులకు సమాచారం అందించారు.  సంఘటన స్థలానికి చేరుకున్న అడిషనల్ డీసీపీ రామ్ కుమార్, సీఐ శ్రీనివాస్,డిఐ రాజు యాదవ్ కేసు నమోదు చేసుకున్నారు.  ఘటన స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.