నో డైట్.. నో వర్కౌట్స్.. మూడు టిప్స్తో 35 కేజీలు తగ్గింది.. ఈమె వెయిట్ లాస్ ప్లాన్కు డాక్లర్లే షాక్ !

నో డైట్.. నో వర్కౌట్స్.. మూడు టిప్స్తో 35 కేజీలు తగ్గింది.. ఈమె వెయిట్ లాస్ ప్లాన్కు డాక్లర్లే షాక్ !

మారిన లైఫ్ స్టైల్.. ఫుడ్ హ్యాబిట్స్ తో.. ఎవరిని టచ్ చేసినా ఏదో ఒక జబ్బుతో దర్శనమిస్తున్న రోజులివి. దీనికి తోడు విపరీతంగా పెరిగిపోతున్న బాడీ వెయిట్ (ఊబకాయం) కారణంగా..  డయాబెటిస్ (షుగర్) , గుండె సంబంధిత వ్యాధులు (హార్ట్ ప్రాబ్లమ్స్), క్యాన్సర్ తో పాటు చాలా రకాల రోగాల ప్రస్తుతం భయపెడుతున్నాయి. ఇలాంటి రోగాలకు చెక్ పెట్టేందుకు ఇప్పుడు అందరూ ఫాలో అవుతున్న ఫార్ములా డైట్ అండ్ వర్కౌట్స్. హెవీ ఫుడ్ ఆల్మోస్ట్ తగ్గించి.. జిమ్ లోకెళ్లి ఘోరమైన వర్కౌట్స్ చేస్తున్నప్పటికీ వెయిట్ లాస్ కావడం చాలా కష్టంగా మారింది. 

కానీ స్నిగ్ధ బోరా అనే ఒక మహిళ.. ఎలాంటి డైట్ పాటించకుండా.. వర్కవుట్స్ ఏవీ లేకుండా.. 35 కేజీల వెయిట్ లాస్ అవ్వడం ఇప్పుడు డాక్టర్లనే షాకింగ్ కు గురిచేస్తోంది. హౌ ఈజ్ ఇట్ పాజిబుల్.. అంటూ సోషల్ మీడియాలో అంతా ఈమె గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఇంత సింపుల్ గా ఎలా అంత వెయిట్ తగ్గారని ప్రశ్నిస్తే త్రీ టిప్స్ పాటిస్తే చాలు అంటోంది స్నిగ్ధ. అవేవో చూసేద్దామా.

1. స్థిరమైన గుండె కోసం సింపుల్ ఎక్సర్సైజ్:

ఇప్పుడున్న టెన్షన్స్.. ఫుడ్ హ్యాబిట్స్ కారణంగా హృద్రోగాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఎవరు ఎక్కడ కూలిపోతున్నారో తెలియదు. అయితే స్థిరమైన గుండె కోసం.. అదే విధంగా వెయిట్ లాస్ కోసం.. ఘోరమైన వ్యాయామాలు అవసరం లేదని స్నిగ్ధ బోరా అంటున్నారు. ఘోరంగా కష్టపడి కొత్త సమస్యలు తెచ్చుకోవాల్సిన పనిలేదని అంటున్నారు. 

దానికి బదులు.. గుండెను స్థిరంగా ఉంచుతూనే వెయిట్ లాస్ అయ్యే మెథడ్ చెప్పారు. గుండెకు, బాడీకి ఎనర్జీ పెంచే సింపుల్ టిప్స్ నడవటం. ప్రతి రోజూ కంటిన్యూగా వాకింగ్ చేయడం. డైలీ 5 వేల అడుగులు వేయడం మొదలు పెట్టాలి. ఆ తర్వాత 7 వేలు.. ఆ తర్వాత 10 వేలు.. అలా ప్రతిరోజు వాకింగ్ చేస్తే స్థిరమైన గుండె వేగం (steady-state cardio) ఉండటంతో ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఆమె అలా నడుస్తూ నడుస్తూ.. ఒకానొక దశలో 21 వేల అడుగులు వేసేదట. ఇంతకు మించిన వ్యాయామం లేదని చెప్పారు.

2. తిండి తగ్గించడం కాదు.. క్యాలరీ బ్యాలన్స్:

చాలా మంది వెయిట్ లాస్ అయ్యేందుకు ఫుడ్ మానేస్తుంటారు. రోజులో ఉదయం లేదా సాయంత్రం అసలు ఆహారమే తీసుకోరు. అది కరెక్ట్ కాదని అంటున్నారు స్నిగ్ధ. బాడీకి కార్బోహైడ్రేట్స్ (పిండి పదార్థాలు) చాలా అవసరం. మెటబాలిజం సరిగ్గా ఉండాలంటే తప్పనిసరి. డైట్ పేరుతో మానేయటం వల్ల ఎలాంటి లాభం లేదంటున్నారు. అది వెయిట్ లాస్ మీద ఎలాంటి ప్రభావం చూపదని చెప్తున్నారు.

వెయిట్ లాస్ కోసం ఆహారం మానేయటం కాదు.. బ్యాలన్స్ డ్ ఫుడ్ తీసుకోవడం. క్యాలరీ బ్యాలన్స్ ఉండేలా చూసుకోవడం. ఎంత తింటి ఎంత క్యాలరీలు వస్తాయి.. అనే విషయం తెలిస్తే.. చాలని చెబుతున్నారు. జీరో కార్బ్.. కీటో డైట్ లాంటివి చేయాల్సిన పని లేదని అంటున్నారు. 

3. గుడ్ స్లీప్.. 7 నుంచి 9 గంటల నిద్ర:

ఎన్ని వర్కౌట్స్ చేసినా.. ఎంత డైట్ పాటించినా.. సరైన నిద్ర లేకపోతే.. వెయిట్ లాస్ కావడం.. రికవరీ కావడం అనేది అసాధ్యం అని చెబుతున్నారు. ప్రతి రోజు ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. తొందరగా పడుకోవడం వలన బాడీకి కావాల్సిన నిద్ర అందితే.. అది వెయిట్ లాస్ కు.. హెల్త్ రికవరీకి సహకరిస్తుందని చెప్తున్నారు.