కరోనా సోకిన మహిళలో 32 మ్యూటేషన్‌లు

కరోనా సోకిన మహిళలో 32 మ్యూటేషన్‌లు

కేప్‌టౌన్: ఒక మహిళలో పదుల కొద్దీ కరోనా మ్యూటేషన్స్‌ను గుర్తించిన సైంటిస్టులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ ఘటన ఎడారి దేశమైన సౌతాఫ్రికాలో జరిగింది. దక్షిణాఫ్రికాకు చెందిన 36 ఏళ్ల ఆ మహిళలో 216 రోజుల పాటు కరోనా వైరస్ బతికి ఉందని పరిశోధకులు గుర్తించారు. హెచ్‌‌ఐవీతో బాధపడుతున్న సదరు మహిళ శరీరంలో 32 రకాల కరోనా వైరస్ మ్యూటేషన్స్‌‌ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు మెడిర్‌‌‌క్సివ్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఆ రిపోర్టు ప్రకారం.. సదరు మహిళకు 2006లో హెచ్‌ఐవీ సోకింది. క్రమంగా ఆమె రోగనిరోధక శక్తి తగ్గుతూ వచ్చింది. గత సెప్టెంబర్‌లో ఆమెకు కరోనా సోకింది. ఆమె ద్వారా ఇతరులకు ఈ మ్యూటెంట్స్ సోకాయో లేదో అనే విషయంపై మాత్రం రీసెర్చర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.